Homeబిజినెస్Kia Carens sales growth: దూసుకుపోతున్న కియా Carens సేల్స్.. ఒక్క ఏడాదిలో 24 వృద్ధి..

Kia Carens sales growth: దూసుకుపోతున్న కియా Carens సేల్స్.. ఒక్క ఏడాదిలో 24 వృద్ధి..

Kia Carens sales growth: దక్షిణ కొరియా కంపెనీ అయినా Kia ఇండియాలో ప్లాంట్ ప్రారంభించిన తర్వాత అమ్మకాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ కంపెనీ SUV కార్లను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అంతేకాకుండా ఇంజన్ పనితీరు కూడా మెరుగ్గా ఉండడంతో మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తూ అమ్మకాలను పెంచుకుంటుంది. అయితే ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం కియా కంపెనీకి చెందిన Carens మోడల్ నాలుగు సంవత్సరాల్లో 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించి 24% వృద్ధిని సాధించింది. మార్కెట్లో మారుతి ఎర్టిగా వంటి కార్లు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. ఈ కారు అమ్మకాలు పెరగడం విశేషం. అయితే దీని అమ్మకాల గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

Kia ఇండియా ప్లాంట్ నుంచి మొత్తం 7 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వీటిలో సెల్టోస్, Sonet వంటి కార్లు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే వీటితోపాటు కారెన్స్ కూడా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా నిలుస్తోంది. ప్రీమియం MPV అయినా ఈ కారు మార్కెట్లోకి వచ్చి.. 2022 ఫిబ్రవరి 15 నుంచి.. 2026 ఫిబ్రవరి 15 వరకు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వ్యవధిలో ఇది 277,236 యూనిట్లు విక్రయించుకుంది. అలాగే 30,000 యూనిట్లకు పైగా ఎగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల తర్వాత ఈ మోడల్ అమ్మకాలు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. కియా carens మార్కెట్లోకి వచ్చినప్పుడు లక్ష అమ్మకాలకు 17 నెలల సమయం పట్టింది. మరో లక్ష అమ్మకాలకు 20 నెలల సమయం పట్టింది. 2025 ఫిబ్రవరి వరకు రెండు లక్షల మార్కుకు చేరుకుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 75 వేల యూనిట్లు విక్రయించింది.

కియా carens విక్రయాలకు ఉత్తమమైన సంవత్సరం గా 2023 చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో 70,314 యూనిట్లు విక్రయించింది. దీంతో ఇండియా మొత్తం అమ్మకాల్లో ఇది 26% వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత 2024 సంవత్సరంలో 63,167 కార్లను సేల్స్ చేసింది. ఈ సమయంలో 10% అమ్మకాలు తగ్గాయి. 2025లో 64,609 యూనిట్లతో రెండు శాతం మాత్రమే పెరిగాయి. కానీ 2026 ఆర్థిక సంవత్సరంలో 66,454 కార్లతో 24% పెరిగి బలమైన కారుగా నిలిచింది. కియా కంపెనీ నుంచి వచ్చిన క్లావిస్ EV కార్లతో కలిపి Carnes మొత్తంగా 29 శాతం వాటాను కలిగి ఉంటుంది.

ఈ కారు డిజైన్తో పాటు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఫీచర్స్ వంటివి వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా ప్రీమియం లుక్ ను అందించే ఆరు లేదా ఏడు సీట్లు సౌకర్యవంతంగా ఉండడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇన్నోవా ఐ క్రాస్, మారుతి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న MPV ల్లో టాప్ 20 కార్లలో ఇది 16వ స్థానాన్ని కలిగి ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version