https://oktelugu.com/

గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఇలా మోసపోయే ఛాన్స్..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను క్షణాల్లో బుకింగ్ చేయడంతో పాటు వేగంగా డెలివరీ పొందే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వినియోగదారులు మోసపోవడంతో పాటు భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ కు సీల్ ఉన్నంత మాత్రాన ఆ సిలిండర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 16, 2021 / 11:08 AM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను క్షణాల్లో బుకింగ్ చేయడంతో పాటు వేగంగా డెలివరీ పొందే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వినియోగదారులు మోసపోవడంతో పాటు భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంటుంది.

    గ్యాస్ సిలిండర్ కు సీల్ ఉన్నంత మాత్రాన ఆ సిలిండర్ కొత్త సిలిండర్ అని అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ లో తక్కువ గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణ సిలిండర్ బరువు 15.3 కేజీలు కాగా అందులో గ్యాస్ బరువు 14.2 కేజీలు ఉంటుంది. మొత్తంగా సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉండగా గ్యాస్ సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో తప్పనిసరిగా సిలిండర్ బరువును చెక్ చేసుకోవాలి.

    29.5 కేజీల కంటే సిలిండర్ బరువు తక్కువగా ఉంటే ఆ సిలిండర్ కు బదులుగా మరో సిలిండర్ ను తీసుకుంటే మంచిది. సిలిండర్ బరువు తక్కువగా ఉంటే డెలివరీ బాయ్‌పై గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు కూడా చేయవచ్చు. బరువు తక్కువగా ఉన్న సిలిండర్‌ ను తీసుకుంటే మాత్రం వినియోగదారులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు అయితే 1800 2333 555 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

    సిలిండర్ కు సీల్ ఉన్నంత మాత్రాన గ్యాస్ సిలిండర్ లో 14.2 కేజీల గ్యాస్ ఉందని భావిస్తే మాత్రం మోసపోయే అవకాశాలు ఉంటాయి.