Kaivalya Vohra- Aadit Palicha: 20 ఏళ్ళున్న పిల్లలు ఏం చేస్తారు? రోజు కాలేజీకి వెళ్తారు. సెల్ ఫోన్లో చాటింగు, స్నేహితులతో ఉప్పర్ మీటింగ్.. ఇంకొంచెం పరిపక్వత ఉన్న యువకులైతే పోటీ పరీక్షల కోసం సిద్ధం అవుతుంటారు. కానీ 20 ఏళ్ల వయసులో 1000 కోట్లు సంపాదించడం సాధ్యమేనా? ఏంటి మమ్మల్ని ఫూల్స్ చేయకండి బాస్ అంటారా? .. మీరు ఎలా అనుకున్నా.. 20 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించడం ఈజీ అని మేమంటాం. అది ఎలాగో మీకు తెలుసుగా.. మరి ఎందుకు ఆలస్యం ఇక చదవండి.
కైవల్య వోహ్రా, ఆదిత్య పలిచా.. ఇద్దరు 20 ఏళ్లలోపు వయసు ఉన్నవారే. కరోనా సమయంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా! మనిషికి మనిషి ఆనుకుంటేనే ఏదో జరిగిపోతుందన్న భయం.. ఇలాంటి సమయంలో ఈ కుర్రాళ్లకు వచ్చిన ఆలోచన వారి జీవితాలని మలుపు తెప్పింది. ఆదిత్య, కైవల్య మొదటి నుంచి చదువుల్లో చురుకు. ఒకరి కింద పని చేసే దానికంటే.. మనమే పది మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలనేదే వీరి ఆలోచన. ఇద్దరు కూడా స్టాండ్ ఫర్డ్ యూనివర్సిటీలో డ్రాప్ ఔట్స్. అయితే ఇద్దరికీ సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టు ఉండటంతో జెప్టో కంపెనీ ప్రారంభించారు. ఇది కిరాణా వస్తువులు డెలివరీ చేసే యాప్.. ఇది చాలా తక్కువ సమయంలో నిమిషాల్లో కిరాణా డెలివరీ చేస్తుంది. ఇది ప్రారంభించినప్పుడు పది నిమిషాల డెలివరీకి హామీ ఇచ్చింది.
Also Read: RuPay Credit Card On UPI: ఈ మూడు బ్యాంకుల కస్టమర్లకు శుభవార్త… ముందుగా వీళ్లకే ఆ కొత్త సేవలు?
ఆది తర్వాత నిమిషాల్లో డెలివరీగా మారింది. ప్రస్తుతం ఇది 11 నగరాల్లో పనిచేస్తోంది.. అంతేకాకుండా అనేక నగరంలో రౌండ్ ది క్లాక్ డెలివరీ ని కూడా చేస్తోంది. అయితే జెప్టో కి బ్లింకిట్ నుంచి పోటీ ఉన్నది. అయితే గత జూన్లో 700 మిలియన్ల డాలర్లు వెచ్చించి జొమాటో బ్లింకిట్ ను కొనుగోలు చేసింది. బ్లింకిట్ ను గతంలో గ్రోఫర్స్ అని పిలిచేవారు. ప్రస్తుతం జెప్టో 2023 నాటికి భారత దేశంలోని 24 నగరంలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందించుకుంది. ఐ ఐ ఎఫ్ ఎల్ వెల్త్ హురూన్ నివేదిక ప్రకారం కైవల్య 1000 కోట్లతో భారత దేశంలోని ధనవంతుల జాబితాలో 1,036 ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆదిత్య కూడా 1200 కోట్ల నికర ఆస్తులతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. వైసి కంటిన్యూటీ ఫండ్ నేతృత్వంలోని రౌండ్ నుంచి జెప్టో రెండు వందల మిలియన్ డాలర్లను సేకరించింది. పెట్టుబడి తర్వాత స్టార్ట్- అప్ దాని విలువను దాదాపు రెట్టింపు చేసి 900 మిలియన్ డాలర్ల మార్కును తాకింది. కాగా గత డిసెంబర్లో జెప్టో మార్కెట్ విలువ 570 మిలియన్ డాలర్లు గా ఉండేది.
కరోనా సమయంలో ఆలోచన మారింది
కోవిడ్ వల్ల 2020, 2021 సంవత్సరాలలో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయింది. బయటకు వెళ్లాలంటే భయం. ఎక్కడ కోవిడ్ ముంపు ముంచుకొస్తుందేమోనని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో వాళ్ల అవసరాలు తీర్చేందుకు ప్రవేశపెట్టిందే జెప్టో యాప్. గతంలో కైవల్య కిరాణా కార్డు అనే యాప్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో అది జెప్టో యాప్ రూపకల్పనలో తోడ్పడింది. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే వినియోగదారులకు తొందరగా చేరువైంది.
పైగా నేరుగా తయారీదారుల నుంచే వస్తువులను కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరలకే అందిస్తుండటంతో యాప్ కు ప్రజాదరణ బాగుంది. ప్రస్తుతం విస్తరణ మార్గంలో ఉన్న ఈ కంపెనీ.. మరిన్ని నిధులు సమీకరించాలని అనుకుంటున్నది. అయితే ఈ కుర్రాళ్ళ వ్యాపార శైలిని చూసి ముచ్చటపడిన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల కంపెనీలో పలు పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆదిత్య, కైవల్య వారి వయసు కంటే రెట్టింపు ఉన్న వారితో ముఖాముఖిగా మాట్లాడారు. అందుకే అంటారు కృషితో నాస్తి దుర్భిక్షమ్ అని.
Also Read: YS Jagan Rule In AP: మూడేళ్ల జగన్ పాలన ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారంటే?