https://oktelugu.com/

BOB Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండానే?

BOB Recruitment: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ముంబై కేంద్రంగా ఉండే ఈ బ్యాంకులో మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌) 1, బిజినెస్‌ హెడ్‌(కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌) […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2021 / 09:38 AM IST
    Follow us on

    BOB Recruitment: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ముంబై కేంద్రంగా ఉండే ఈ బ్యాంకులో మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌) 1, బిజినెస్‌ హెడ్‌(కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌) 1 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

    బిజినెస్‌ హెడ్‌(లోన్‌ అగైనెస్ట్‌ ప్రాపర్టీ అండ్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌) ఉద్యోగ ఖాళీలు 1, వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) 4 ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ పాసైన వాళ్లు హెడ్, బిజినెస్ హెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 36 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) ఉద్యోగ ఖాళీలకు 32 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది.

    https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.