Jio Mart: ప్రస్తుతం క్విక్ డెలివరీ యాప్‌ల హవా నడుస్తోంది. క్షణాల్లో ఇంటికే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే సౌలభ్యం అందరికీ కావాలి. కానీ, ఈ సౌకర్యం కోసం ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించాల్సి వస్తే.. ఇక్కడే జియోమార్ట్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒక్క రూపాయి కూడా ఎక్స్ ట్రా వసూలు చేయకుండా క్విక్ డెలివరీ ఇస్తోంది. అది ఎలా మిగతా యాప్‌లకు గట్టి పోటీనిస్తోందో తెలుసుకుందాం.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఈజీ లైఫ్ కోరుకుంటారు. అలాంటి వారికోసం అనేక యాప్‌లు ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల నుంచి మొబైల్ ఫోన్ల వరకు క్షణాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఈ క్విక్ డెలివరీ రేసులో జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి పెద్ద కంపెనీలతో పాటు ముఖేష్ అంబానీకి చెందిన జియోమార్ట్ కూడా పోటీపడుతోంది. అయితే, జియోమార్ట్‌కు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అదేమిటంటే.. ఇది మిగతా యాప్‌ల మాదిరిగా ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయడం లేదు. జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి దిగ్గజాలకు జియోమార్ట్ ఎలా గట్టి పోటీ ఇస్తుందో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
జియోమార్ట్ ఎలా పోటీ ఇస్తోంది?
జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలు కేవలం 10 నిమిషాల్లోనే మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తాయి. ఈ కంపెనీలన్నీ ప్రొడక్ట్ ధరతో పాటు రకరకాల ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు, హ్యాండ్లింగ్ ఛార్జ్ అంటూ ఒక్కో ఆర్డర్‌పై రూ.4 నుంచి రూ.9 వరకు అదనంగా బాదుతున్నాయి.
సమయం ఆదా అవుతుంది కదా అని అనుకోవచ్చు. మీ సమయం ఆదా అవుతుందనడంలో సందేహం లేదు కానీ. కానీ, మార్కెట్‌లో ఒక యాప్ మాత్రం కేవలం ప్రొడక్ట్ ధర మాత్రమే తీసుకుంటోంది. డెలివరీ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ ఒక్క రూపాయి కూడా ఎక్స్ ట్రా వసూలు చేయడం లేదు. ఇదే ఈ యాప్ అతి పెద్ద స్పెషాలిటీ.
డెలివరీ టైం మిగతా యాప్‌ల కంటే కొంచెం ఎక్కువ ఉండవచ్చు. ముఖేష్ అంబానీకి చెందిన జియోమార్ట్ 10 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో డెలివరీ చేస్తామని చెబుతోంది. అదే ఇతర యాప్‌లు ఎక్స్ ట్రా మనీ తీసుకుని 10 నిమిషాల్లో డెలివరీ ఇస్తున్నాయి. 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండగలిగితే ఈ యాప్ మీకు బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు 10 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో డెలివరీ కావాలంటే జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.