Homeబిజినెస్Jio Electric Scooter: ఉద్యోగులకు, ఇంటి అవసరాలకు ఉపయోగపడే Jio అందిస్తున్న తక్కువ ధర స్కూటర్..

Jio Electric Scooter: ఉద్యోగులకు, ఇంటి అవసరాలకు ఉపయోగపడే Jio అందిస్తున్న తక్కువ ధర స్కూటర్..

Jio Electric Scooter: రోజువారి ఇంటి అవసరాలతో పాటు కార్యాలయాలకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం తప్పనిసరిగా మారింది. అయితే ప్రస్తుతం బైక్ కొనాలంటే లక్షల రూపాయలు ధర చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న అవసరాలతో పాటు తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని Reliance కంపెనీ Jio ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ స్కూటర్ అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో తమ అవసరాలు తీర్చడానికి ఇది రోడ్లపై సులువుగా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా ఉంటుంది. మరి ఈ స్కూటర్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత కాలంలో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడంపై దృష్టిని సారించాయి. ఇందులో భాగంగా జియో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రావడానికి సిద్ధమవుతుంది.. ఈ స్కూటర్లో 4 kW నుంచి 6 kW లిథియం అయాన్ ప్యాక్ తో కూడిన బ్యాటరీ ఉండనుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ నాలుగు నుంచి ఆరు గంటల్లో 100% పూర్తయ్యే అవకాశం ఉంటుంది. AI టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తున్న ఈ స్కూటర్ ఎక్స్టీరియర్ డిజైన్ కూడా స్పెషల్ గా ఉంది. విశాలమైన ఫ్లోర్ బోర్డ్ తో పాటు.. ఇద్దరు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా సీటింగ్ అమర్చారు.

అలాగే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్స్ ఉన్నాయి. AI ఆధారిత డయాగ్నస్టిక్స్, వాయిస్ రికగ్నైజేషన్, OTA అప్డేట్, డిజిటల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే తో పాటు స్మార్ట్ కనెక్టివిటీ సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ స్కూటర్లో CBS తో కూడిన డిస్క్ బ్రేకులు, LED హెడ్ లాంప్స్ రైడర్లకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు సేఫ్టీని అందిస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.70,000 నుంచి రూ.90,000 వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందే ఈ స్కూటర్ను బుక్ చేసుకుంటే రూ.2,999 తో ఆర్డర్ చేయవచ్చు. త్వరలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ తక్కువ ధరలో చిన్న అవసరాలకు స్కూటర్ కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. అంతేకాకుండా సమీప దూరంలో ఉండే కార్యాలయాలకు వెళ్లేవారు సైతం దీనిని ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ సౌకర్యం కూడా అనుకూలంగా ఉండడంతో పెట్రోల్ ఖర్చులు సేవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version