Homeఆంధ్రప్రదేశ్‌Student was brutally beaten: మీరు పోయింది చదువుకోవడానికా.. ఇంతటి ఘోరాలకా? ఏపీలో దారుణ వీడియో

Student was brutally beaten: మీరు పోయింది చదువుకోవడానికా.. ఇంతటి ఘోరాలకా? ఏపీలో దారుణ వీడియో

Student was brutally beaten: ఒకప్పుడు ఉపాధ్యాయులు కఠినంగా ఉండేవారు. చదువు రాకపోతే విద్యార్థుల వీపు మోత మోగించేవారు. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సపోర్ట్ చేసేవారు. తమ పిల్లలు తప్పు చేస్తే దండించాలని సూచించేవారు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఆ విధంగా ఉంటేనే విద్యార్థులు సన్మార్గంలో ఉంటారు. ఉన్నత స్థానంలో స్థిరపడతారు. తద్వారా దేశం కూడా బాగుపడుతుంది.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా విద్యార్థులు గాడి తప్పుతున్నారు. యుక్త వయసులో ఉద్రేకాలకు గురవుతున్నారు. ఉద్వేగాలను ఏమాత్రం ఆపుకోవడం లేదు. పైగా సినిమాల ప్రభావంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ధూమపానం.. మద్యపానం. మత్తు పదార్థాల సేవనం వంటి అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. తద్వారా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. సినిమాల మాదిరిగా పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒక విద్యార్థిని దారుణంగా కొట్టారు. అతడు కింద పడిపోయినప్పటికీ కూడా అలానే కొట్టారు. గత నెల 8న ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత అందరి చూపు ఈ విశ్వవిద్యాలయం పై పడింది. ఇప్పుడు ఓ విద్యార్థి పై తోటి విద్యార్థులు ఇలా దాడి చేయడం సంచలనం కలిగిస్తోంది…

ఈ ఘటనాలు బయటికి రాకుండా యాజమాన్యం జాగ్రత్త వహించినప్పటికీ.. కొంతమంది ఈ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్త సంచలనంగా మారాయి. వాస్తవానికి కాలేజీలలో చదువుకునే విద్యార్థులు పద్ధతిగా ఉండాలి. అలా కాకుండా ఇలా వ్యవహరిస్తే ఇదిగో ఇటువంటి ఘటనలే చోటుచేసుకుంటాయి. ఇప్పటికైనా యాజమాన్యం విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగమని ఏపీలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అన్నట్టు ఆ విద్యార్థి బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డాడు అనేది ఇంతవరకు బయటికి రాలేదు. అది బయటికి రాకపోవడానికి యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడం కారణమా.. ఇంకా ఏదైనా ఉందా.. అనే విషయాలు ఇప్పుడు తెలియాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version