Jio Data Usage: జియో.. భారత టెలికాం రంగంలో ఓ సంచలనం. తక్కువ ధరకు ఎక్కువ డాటా తో మొబైల్ యూజర్ లను తన వైపు తిప్పుకుంది. రికార్డు స్థాయిలో కస్టమర్లను సంపాదించింది. మరోసారి భారత టెలికామ్ రంగాన్ని తన సంఖ్యా బలంతో ముంచేసింది. 2026 ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాల్లో జియో సబ్‌స్క్రైబర్ బేస్ 524.4 మిలియన్లు (52.4 కోట్లు) దాటింది. ఇక సగటు డేటా వినియోగం 42.3 జీబీకి చేరింది. భారతదేశం డేటా-డ్రివెన్ డిజిటల్ ఎకానమీ వైపు ఎంత వేగంగా పయనిస్తోందో స్పష్టంగా చెప్పే సంకేతాలు.
భారీగా సబ్స్క్రైబర్లు..
జియో సబ్స్క్రైబర్లు 524.4 మిలియన్లు ఉండగా క్యూ4లో కొత్తగా 9.1 మిలియన్ల కస్టమర్లు చేరారు. ఇందులో 5జీ యూజర్లు: 268 మిలియన్లు. మొత్తం సబ్స్క్రైబర్లలో సగం కంటే ఎక్కువ 5జీ ట్రాఫిక్ మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్‌లో 55 శాతం వాటా ఉంది. నెలకు సగటున 42.3 జీబీ అని వెల్లడించారు. క్వార్టర్ మొత్తం డేటా ట్రాఫిక్ 66 ఎక్సాబైట్స్ తో 35 శాతంపెరిగిందని తెలిపారు.
ఒక్కో యూజర్ నుంచి రూ.214..
జియో కస్టమర్ నుంచి సంస్థకు భారీగా ఆదాయం వస్తుంది. ఒక్కో యూజర్ నుంచి సగటు రూ.214 పొందుతున్నట్లు వెల్లడించింది. నాలుగో త్రైమాసికంలో ఆదాయం 3.8 శాతం పెరిగిందని తెలిపింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ 27.1 మిలియన్ కనెక్షన్లు (2.71 కోట్లు), మార్కెట్ షేర్ సుమారు 43 శాతం అని నివేదిక పేర్కొంది. జియో ఫైబర్ యూజర్లు 13 మిలియన్లు ఉన్నట్లు తెలిసింది.
ఈ సంఖ్యలు భారతీయుల డిజిటల్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
హై క్వాలిటీకి ప్రాధాన్యం..
ఒక సాధారణ జియో యూజర్ కూడా హై-క్వాలిటీ వీడియోలు, రీల్స్, లైవ్ స్ట్రీమింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, గేమింగ్‌లను సాఫీగా వాడుతున్నారని జియో నివేదిక ద్వారా తెలుస్తుంది.. 5జీ విస్తరణతో ఈ ట్రెండ్‌ను మరింత వేగవంతం చేసింది.
తక్కువ ధరల వ్యూహంతో మార్కెట్‌ను గెలిచి..
మొబైల్ రీఛార్జ్ ధరలు అధికంగా ఉన్న సమయంలో మార్కెట్లోకి వచ్చిన జియో తక్కువ ధరతో ఎక్కువమంది కస్టమర్లను తమ వైపు తిప్పుకుంది. ఇప్పుడు వాల్యూమ్ ద్వారా లాభాలను పెంచుకుంటోంది. సగటు ఆదాయం రూ.214 వద్ద ఉన్నప్పటికీ, భారీ స్కేల్ కారణంగా మార్జిన్స్ 52.4 శాతం వద్ద స్థిరంగా ఉండటం అద్భుతం. ఇది ప్రపంచంలోనే అత్యంత లాభదాయక టెలికామ్ బిజినెస్ మోడల్స్‌లో ఒకటి. అయితే, ఈ డేటా వినియోగం నిజంగా ఆర్థిక వృద్ధికి, నైపుణ్యాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు ఎంతగా ఉపయోగపడుతోంది? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వృద్ధి కనిపిస్తే, అది నిజమైన డిజిటల్ ఇండియా సాధన. కానీ నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా వినియోగం జరుగుతున్నట్లు కనిపిస్తే, డిజిటల్ డివైడ్ ఇంకా కొనసాగుతోందని అర్థం.
ఫిక్స్డ్ బ్రాండ్ పై ఫోకస్..
ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ వైపు జియో దృష్టి సారించడం స్మార్ట్ మూవ్. ఇది హోమ్ ఇంటర్నెట్ మార్కెట్లో ఆధిపత్యం సాధించడానికి మాత్రమే కాకుండా, భవిష్యత్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్, ఎల్ ఓ టీ , స్మార్ట్ సిటీలకు బలమైన ఫౌండేషన్ వేస్తుంది.
ప్రస్తుతం టెలికామ్ మార్కెట్లో జియో, ఎయిర్ టెల్ మధ్యనే పోటీ ఉంది. జియో 42.3 GB సగటు డేటా వినియోగంతో భారత్‌ను ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో ఒకటిగా మార్చేసింది. ఇది ముకేష్ అంబానీ సంస్థలోని దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం. డిజిటల్ ఇండియా కలను నిజం చేయడంలో జియో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఈ వృద్ధి సమానంగా, అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇది నిజమైన విజయం అవుతుంది. భారత్ డిజిటల్ యుగంలోకి అడుగులు వేస్తోంది, జియో ఆ మార్గాన్ని వేగవంతం చేస్తోంది.
