Homeబిజినెస్Jeep : జీప్ కంపెనీ కార్ల మీద ఏకంగా రూ.3.90లక్షల డిస్కౌంట్

Jeep : జీప్ కంపెనీ కార్ల మీద ఏకంగా రూ.3.90లక్షల డిస్కౌంట్

Jeep : ఈ జూలైలో ఒక అదిరిపోయే ప్రీమియం SUV కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఓ గుడ్ న్యూస్. జీప్ ఇండియా ఈ నెలలో తమ పాపులర్ SUVలైన కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీ లపై ఏకంగా రూ.3.90 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కొన్ని వేరియంట్లు, అలాగే కొందరు ప్రత్యేక కస్టమర్లకే వర్తిస్తాయి. ముఖ్యంగా డాక్టర్లు, కార్పొరేట్ ఉద్యోగులు లేదా లీజింగ్ కంపెనీలతో సంబంధం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

జీప్ మెరిడియన్
జీప్ కంపెనీకి చెందిన 7-సీటర్ ప్రీమియం ఎస్యూవీ జీప్ మెరిడియన్ పై ఈసారి అన్నింటికంటే పెద్ద తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కారుపై మీరు ఏకంగా రూ.3.90 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.2.30 లక్షల కన్స్యూమర్ డిస్కౌంట్ ఉంటుంది. దీనికి అదనంగా రూ.1.30 లక్షల కార్పొరేట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అంతేకాదు, డాక్టర్లు, లీజింగ్ సంస్థల కోసం రూ.30,000 అదనపు ప్రయోజనం కూడా ఉంది. అయితే, ఈ రూ.30,000 ఆఫర్‌ను కార్పొరేట్ ఆఫర్‌తో కలిపి పొందలేరు.

Also Read: హారియర్ ఈవీ vs క్రెటా ఎలక్ట్రిక్.. ఏది ఎక్కువ దమ్మున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ?

జీప్ కంపాస్
తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం ఎస్యూవీ కావాలనుకునే వాళ్లకు జీప్ కంపాస్ పై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఈ మిడ్-సైజ్ SUVపై రూ.2.80 లక్షల వరకు తగ్గింపు (కన్స్యూమర్ డిస్కౌంట్ + కార్పొరేట్ డిస్కౌంట్ కలిపి) లభిస్తోంది. అంతేకాదు, డాక్టర్లు, ఇతర స్పెషల్ ప్రొఫెషనల్స్ కు రూ.15,000ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్రత్యేక వృత్తిపరమైన డిస్కౌంట్ సాధారణ కార్పొరేట్ డిస్కౌంట్‌తో కలపడానికి వీలు లేదు. మొత్తంగా, జీప్ కంపాస్‌పై గరిష్టంగా రూ.2.95 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

జీప్ గ్రాండ్ చెరోకీ
జీప్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన లగ్జరీ SUV జీప్ గ్రాండ్ చెరోకీ కొనుగొలు చేయాలనుకునే వాళ్లకు ఏకంగా రూ.3 లక్షల డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ SUV ఒకే ఒక వేరియంట్ (లిమిటెడ్ (O)) లో వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67.50 లక్షలు. ఈ కారుపై ఎలాంటి ఎక్స్ ట్రా స్కీమ్స్ లేనప్పటికీ రూ.3 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్స్‌తో పాటు, జీప్ కంపెనీ జీప్ వేవ్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ ను కూడా అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో జీప్ కస్టమర్లకు ప్రీమియం సర్వీసులు, మెయింటెనెన్స్ బెనిఫిట్స్ , కస్టమర్ కేర్ సర్వీసెస్ లభిస్తాయి. ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడానికి దగ్గర్లోని జీప్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version