కొన్ని వస్తువులు ఉత్పత్తి స్థానం నుంచి షాప్ వరకు వచ్చే సమయంలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ డ్యామేజ్ ను ఒక్కోసారి గుర్తించడం వీలుకాదు. చాలావరకు వస్తువులు డబ్బాల్లో ప్యాక్ చేయడం ద్వారా అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసినప్పుడు డ్యామేజ్ బయట పడుతుంది. కానీ కొందరూ షాపు వాళ్లు డ్యామేజ్ తో తమకు సంబంధం లేదన్నట్లు మాట్లాడుతారు. ముందు జాగ్రత్తగా నో ఎక్ఛేంజ్, నో రిటర్న్స్ అనే బోర్డులు పెడతారు. అయితే ఈ బోర్డు పెట్టడం నిబంధనలకు విరుద్ధమే.. అది ఎలాగంటే?
The Consumer Goods(Right To Returns) Bill 2005 ప్రకారం Chapter III లో ఒక షాప్ నుంచి ఏ వస్తువు కొనుగోలు చేసినా అది డ్యామేజ్ అయితే లేదా నచ్చలేదు అనుకుంటే దానిని మార్చుకునే సదుపాయం ను కల్పించారు. వస్తువు డ్యామేజ్ అయితే అలాంటి వస్తువు లేని సమయం రిఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ షాప్ వాళ్ళు ఈ విషయంలో ఒప్పుకోకపోయినా లేదా .. వస్తువు ఎక్చ్సేంజ్ చేయకపోయినా 1800-11-400 కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వవచ్చు.
ఈ విధంగా కొత్త వస్తువు ఏదైనా కొనుగోలు చేసిన లేదా కొన్న వస్తువు నచ్చకపోయినా దానిని మార్చుకోవచ్చు. అయితే ఇది 15 రోజుల లోపు షాపునకు తీసుకువస్తే నే రిటర్న్స్ ఇస్తారు. గడువు దాటితే ఈ అవకాశం ఉండదు. అందువల్ల ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. లేదా కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల లోపు దానిని మార్చుకోవాలి. లేకుంటే చాలా వరకు నష్ట పోతారు.