Iphone 17: Apple కంపెనీకి చెందిన iphone కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీని నుంచి వచ్చిన వివిధ సిరీస్ లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయినా కూడా కొంతమంది దీని నుంచి కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆపిల్ కంపెనీ తాజాగా ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది. 2026 ఫిబ్రవరిలో కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీని గురించిన సమాచారం లీక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలా ఉండబోతుంది? దీని ధర ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం..
iphone సిరీస్లో భాగంగా ఇప్పటివరకు 16 మార్కెట్లోకి వచ్చింది. అయితే కొత్తగా ఇప్పుడు iPhone 17 వినియోగదారులకు పరిచయం చేయబోతుంది. పాత సిరీస్ తో పోలిస్తే కొత్త మొబైల్ ఎన్నో రకాల మెరుగైన ఫీచర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే iPhone 17 మొబైల్ లో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన కెమెరా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో 48 MP మెయిన్ కెమెరా ఉండాలి ఉన్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితో పాటు.. కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా 4k వీడియోలు రికార్డింగ్ చేయడానికి కూడా ఈ resolution బాగా సరిపోతుంది అన్న చర్చ సాగుతోంది. అలాగే ఈ మొబైల్ లో పవర్ఫుల్ చిప్ సెట్ అమర్చే అవకాశం ఉంది. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ టు సపోర్ట్ చేయనుంది. రోజువారి వినియోగదారులతోపాటు.. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ చేసుకోవాలని అనుకుంటే ఈ చార్జింగ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
ఆన్లైన్లో తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 19న ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ధర 599 నుంచి 649 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా యాపిల్ ఫోన్ కొనాలని అనుకునే వారితో పాటు ఇప్పటికే ఉన్న మొబైల్ స్థానంలో కొత్త దానిని చేర్చుకోవాలని అనుకునే వారికి ఈ ధర అనుకూలంగా ఉండనుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయిట్ చేయాల్సిందే..
