Stock Market: పనిచేయకుండానే లక్షల రూపాయల ఆదాయం.. తెలిస్తే విడిచిపెట్టరు..

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించొచ్చు. అయితే ఒక్కోసారి భారీగా నష్టాలు కూడా రావొచ్చు. కొంచెం ప్రణాళిక ప్రకారంగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు.

Written By: Srinivas, Updated On : January 5, 2024 6:55 pm

Stock Market

Follow us on

Stock Market: నేటి కాలంలో ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉంది. ఒక వ్యక్తి తాను బతకడంతో పాటు కుటుంబాన్ని పోషించడానికి వేలల్లో ఆదాయం ఆర్జించాల్సి ఉంటుంది. కొంచెం హైఫైగా బతకాలంటే లక్షల్లో జీతం అందుకోవాలి. కానీ చాలా మంది తక్కువ ఆదాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే అదనంగా ఆదాయం రావడానికి కొన్ని మార్గాలున్నాయి. ఇవి ఎలాంటి పనిచేయకుండా.. వాటి కోసం సమయం వెచ్చికుండానే డబ్బులు వస్తాయి. రూపాయల్లో నుంచి లక్షల్లో ఆదాయం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇలా పనిచేయకుండా ఆదాయం రావాలంటే మాత్రం ముందుగా ఒక చిన్న పని చేయాలి. అదేంటో ఒకసారి చూద్దాం…

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించొచ్చు. అయితే ఒక్కోసారి భారీగా నష్టాలు కూడా రావొచ్చు. కొంచెం ప్రణాళిక ప్రకారంగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే దానిపై వచ్చిన లాభాలను డివిడెండ్లు అంటారు. ఈ డివిడెంట్లను యాజమాన్యం తన స్టాక్ హోల్డర్లకు లేదా వాటాదారులకు చెల్లిస్తుంది. పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి వీటిని ఇస్తూ ఉంటుంది.

ఈ డివిడెండ్లను కంపెనీ స్టాక్ రూపంలో లేదా నగదు రూపంలో చెల్లిస్తుంది. స్టాక్ రూపంలో చెల్లిస్తే ఎలాంటి పన్నులు విధించబడవు. కానీ నగదు రూపంలో చెల్లిస్తే దీనిని అందుకున్నవారు పన్ను కట్టాల్సి ఉంటుంది. స్టాక్ హోల్డర్లు డివిడెంట్లు అందుకుంటే అవి షేర్ల రూపంలో యాడ్ అవుతాయి. వీటి ద్వారా మరికొన్ని షేర్లు కొనుగోలు చేయడానికి అవకాశంగా ఉంటుంది. వీటిని కంపెనీలు నెలవారీ, త్రైమాసికం, వార్షిక సంవత్సరం ప్రకారం చెల్లిస్తారు.

ఉదాహరణకు ఒక కంపెనీ ఇన్వెస్ట్ మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లో లాభాలు వస్తే వీటిని తన కంపెనీ వాటాదారులు లేదా స్టాక్ హోల్డర్లకు చెల్లిస్తుంది. వీటిని ఉద్యోగులకు లాభాలుగా ప్రకటించాలనుకుంటే వారి పేరుమీద డివిడెండ్లుగా మార్చుకోవచ్చు. ఇలా ఉద్యోగులు తమకు వచ్చిన డివిడెండ్ల ద్వారా షేర్లు కొనడం ద్వారా లేదా.. వాటిపై నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నష్టాలకు ఆస్కారం లేకుండా స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇది వేల నుంచి లక్షల రూపంలో కూడా ఉండొచ్చు. ఇలా ఎలాంటి శ్రమ లేకుండా లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు.