Anand Mahindra House: అతడికి ట్రాక్టర్ల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ లెక్క కడితే 33 వేల కోట్లకు మించిపోతాయి. ఇక ఇతర దేశాలలో ఉన్న వ్యాపారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు వాహనాల వ్యాపారంలో ప్రస్తుతం అతడు నెలకొల్పిన సంస్థ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వాహనాల అమ్మకాలలో పెద్దపెద్ద కంపెనీలను సైతం పడుకోబెడుతోంది. అటువంటి వ్యాపారవేత్త ఉండే చాలా పెద్దదని.. విలాసవంతంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేశారు.. అన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో సంపాదన ఉన్నప్పటికీ.. అతడు ఉంటున్నది ఓ మామూలు ఇంట్లో.. అది కూడా అతడి ముత్తాతలు కట్టించింది..
మనదేశంలో పేరుపొందిన వ్యాపారవేత్తలలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆటోమొబైల్ వ్యాపారం ద్వారా మన దేశానికి సరికొత్త దిశను చూపించిన ఘనత ఆనంద్ సొంతం. ఇక అప్పట్లో సత్యం కంప్యూటర్స్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఆ సంస్థను సొంతం చేసుకున్నారు ఆనంద్.. ఆ తర్వాత దానికి టెక్ మహీంద్రా అని పేరు పెట్టారు. ఆ కంపెనీ ద్వారా ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వ్యాపారాల ద్వారా మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ విపరీతమైన యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు. అందులో ప్రశ్నించేతత్వం ఉంటుంది.. వ్యంగ్యం ఉంటుంది.. హాస్యం కూడా ఉంటుంది. అందువల్లే ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తుంటారు.
వాస్తవానికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆనంద్ విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడరు. ఆయనకు ఉన్న సంపాదనతో ముకేశ్ అంబానీ నిర్మించిన ఆంటీలియా కంటే అతిపెద్ద, అత్యున్నత సౌకర్యాలు ఉన్న గృహాన్ని నిర్మించగలరు. కానీ సింప్లిసిటీని ఇష్టపడే ఆనంద్.. ఆ స్థాయిలో ఆలోచించలేదు. అందువల్లే ఆయనను నిరాడంబరమైన వ్యాపారవేత్త అని అంటున్నారు. తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో ఆనంద్ మహీంద్రా తర్వాతనే ఎవరైనా. అంతే కాదు మన దేశంలో క్రీడాకారులకు ఆయన తన కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులను అందిస్తుంటారు. వారిని సముచితంగా గౌరవిస్తుంటారు.