https://oktelugu.com/

Banking Sector : వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ నిర్ణయమిదేనా? నిపుణులు ఏమంటున్నారు..?

ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీశ్ కర్నాటక్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం బ్యాంకులు తమ వనరుల కోసం మరికొన్ని త్రైమాసికాలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రుణం తీసుకోవడానికి డిపాజిట్ల ధరల పెరుగుదలను దాట వేస్తున్నట్లు తెలిపారు. అధిక ఎంసీఎల్ఆర్ రేట్లు, రెపో రేటును కూడా బ్యాంకులు పెంచవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2024 / 04:34 PM IST
    Follow us on

    Banking Sector : బ్యాంకుల్లో రెపో రేటు తగ్గింపు కోసం ఈ వారం ద్రవ్య విధాన కమిటీ సమావేశాన్ని నిర్ణయించారు. పరపతి విధాన సమీక్ష కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ కమిటీ సమావేశాన్ని ఈనెల 6 నుంచి 8 వరకు నిర్వహించబోతున్నది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షన ఈ మీటింగ్ జరగబోతున్నది. అయితే కీలక రెపో రేటును యధాతథంగా 6.5 వద్దే ఉంచే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నా, జీడీపీ వృద్ధి మాత్రం బాగున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు సమాచారం. ఇటు బ్యాంకులు డిపాజిట్ల సేకరణ, రుణ రేట్ల పెంపుపై దృష్టి పెట్టాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖరా తెలిపిన ప్రకారం తెలిపిన ప్రకారం.. మార్కెట్లు ఇకపై వడ్డీ రేట్ల పెంపదల కోసం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైపు ఎక్కువ కాలం చూడలేవు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ రేట్లను పెంచితే ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని కాదు. అయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదట ఈ రేట్లను తగ్గించింది. తర్వాత దీన్ని ఆస్ర్టేలియా ఫాలో అయ్యిందని చెప్పుకొచ్చారు. జపాన్ లోనూ పెరిగింది. కానీ అన్ని సెంట్రల్ బ్యాంకులు దీనిని ఫాలో కాలేదు అంటూ తెలిపారు.

    బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మాటలివి..
    ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీశ్ కర్నాటక్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం బ్యాంకులు తమ వనరుల కోసం మరికొన్ని త్రైమాసికాలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రుణం తీసుకోవడానికి డిపాజిట్ల ధరల పెరుగుదలను దాట వేస్తున్నట్లు తెలిపారు. అధిక ఎంసీఎల్ఆర్ రేట్లు, రెపో రేటును కూడా బ్యాంకులు పెంచవచ్చు. వడ్డీ రేటు మార్కెట్ ను వక్రీకరించే విషయం ఏమిటంటే ఎస్ఏపై తగినంతగా అందించనందుకు డిపాజిటర్లు బ్యాంకులను శిక్షిస్తున్నారు. ఇక పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇప్పటికీ తమ రుణాలను నిర్ణయించుకుంటున్నాయి. తాజాగా రూపాయి రుణంపై సగటు రుణ రేటు 11 బేసిక్ పాయింట్లు తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సగటు దేశీయ టర్మ్ డిపాజిట్ రేటు 3 బేసిక్ పాయింట్లు తగ్గింది. ఎస్బీఐ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే.. వడ్డీ రేట్ల పెంపు కారణంగా చిన్నవ్యాపారాలు పెద్ద భారాన్ని మోస్తున్నట్లు పేర్కొంది.

    ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సాబ్నవీస్ ముందుగా రేట్ల తగ్గింపు ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆర్భీఐ ఎంపీసీ రెపో రేటును ఒక స్థిరత్వంలో ఉంచినట్లు పేర్కొన్నారు. ద్రవ్య విధానం వైఖరి ఉపసంహరణ సమయంలో ఉంటుందని భావిస్తున్నారు. ద్రవ్య విధానం వైఖరిని గతేడాది జూన్ లో మార్చారు. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్ష అవసరమని ఆర్బీఐ భావిస్తోంది. ఇటీవలి నెలల్లో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం స్థాయిలు కూడా ఇందుకు కారణంగా మారింది.

    మరో ప్రాంతీయ ఆర్థిక వేత్త ఏం చెప్పారంటే..
    ఇక బర్ల్కెస్ ప్రాంతీయ ఆర్థిక వేత్త శ్రేయా సోధాని ఏమన్నారంటే.. ‘రేట్ల తగ్గింపు నిర్ణయం 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్, 2024 నాటి రేట్ల తగ్గింపు ఉండబోతున్నట్లు ఆశలు కనిపిస్తున్నాయి’ అన్నారు. కానీ 2025 వరకు ఆలస్యమైతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఆర్బీఐ నుంచి తాజాగా అందిన సమాచారం ప్రకారం.. పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణంపై మరింత అప్రమత్తత అవసరమన్నారు.