https://oktelugu.com/

Marriages: పెళ్లి చేసుకుంటే రూ.2.5 లక్షలు పొందే అవకాశం.. ఏ విధంగా అంటే?

Marriages: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి చేసుకునే యువతులకు ప్రయోజనం చేకూరేలా వేర్వేరు పేర్లతో పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం కాగా చాలామందికి పెళ్లి విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది వారి కులానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే మరి కొందరు మాత్రం కులాంతర వివాహం చేసుకోవడానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 10, 2022 9:03 pm
    Follow us on

    Marriages: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి చేసుకునే యువతులకు ప్రయోజనం చేకూరేలా వేర్వేరు పేర్లతో పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం కాగా చాలామందికి పెళ్లి విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి.

    కొంతమంది వారి కులానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే మరి కొందరు మాత్రం కులాంతర వివాహం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపుతారు. అయితే కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ స్కీమ్ అమలవుతోంది. కులాంతర వివాహం చేసుకున్న వాళ్లు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.

    కులాంతర వివాహం చేసుకున్న వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వివాహం చేసుకున్న వారిలో షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన వ్యక్తి ఒకరు కావడంతో పాటు నా షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన వాళ్లు మరొకరై ఉండాలి. హిందూ వివాహ చట్టం 1955 లేదా ఇతర విదానాలలో పెళ్లి చేసుకున్న వాళ్లు సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది.

    కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ డబ్బులో భార్యాభర్తల పేరుపై తెరిచిన బ్యాంక్ అకౌంట్ లో లక్షన్నర రూపాయలు, డిపాజిట్ చేసి మిగిలిన లక్ష రూపాయలను మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి అందిస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలులో ఉండటం గమనార్హం.