Infinix Note Edge: నేటి కాలంలో మొబైల్ కొనాలని అనుకునేవారు స్పెసిఫికేషన్స్ తో పాటు లుకింగ్ కూడా బాగుండాలని అనుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం ఆకట్టుకునే డిజైన్ ను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ వచ్చినప్పటికీ వీటికి భిన్నంగా సన్నని కర్వ్డ్ డిజైన్ ను కలిగిన ఫోన్ ఒకటి ఆకర్షిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు.. బ్యాటరీ, కెమెరా పనితీరు మెరుగ్గా ఉండడంతో దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Mobiles పై ఎక్కువగా శ్రద్ధ చూపేవారికి infinix మొబైల్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి లేటెస్ట్ గా Note Edge అనే స్మార్ట్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా దీనిని చూడగానే వెంటనే కొనేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే దీనిని ఆకట్టుకునే డిజైన్ లో తయారు చేశారు. ఇందులో ప్రధానంగా 3D Curved AMOLED డిస్ప్లేను చూడవచ్చు. ఇది 1.5 k resolution తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైనమిక్ సిటీ 6400 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న మోటరోలా ఎడ్జ్ 70 కంటే కాస్త మందంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లోని బ్యాటరీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6,500 mAh బ్యాటరీని అమర్చారు. ఇది ప్రస్తుతం రోజంతా వినియోగం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే దీని డౌన్ టైం కూడా తక్కువగా ఉంటుంది. ఫోటోగ్రఫీ తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం పనిచేసే వారికి బ్యాటరీ సేవ్ అవుతుంది. అలాగే ఈ బ్యాటరీ 18 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది.
ఈ మొబైల్లో కెమెరా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాను అమర్చారు.5 MP సెల్ఫీ కెమెరాను చేర్చారు. ఈ కెమెరాతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. అలాగే AI ఆధారిత ఫోటోలు కూడా పొందవచ్చు. ఇక 4k వీడియోలు తీసుకోవచ్చు. ఈ మొబైల్ ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. యూత్ తో పాటు రోజంతా మొబైల్ వినియోగించే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రీమియం లుక్ ను కలిగి ఉన్న ఈ మొబైల్ రూ.17,999 ధరతో విక్రయించే అవకాశం ఉంది.