LPG Insurance: గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దేశంలోని చాలా ప్రాంతాలలో చోటు చేసుకున్నాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతే మరి కొన్నిసార్లు గాయాల పాలవుతూ ఉంటాం. అయితే గ్యాస్ సిలిండర్ల వల్ల సంభవించే పేలుళ్లకు ఉచితంగా పరిహారం పొందే ఛాన్స్ ఉంటుంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీమా బ్రోచర్ లలో ఈ విషయాలను వెల్లడిస్తాయి. కంపెనీల వెబ్ సైట్లలో కూడా ఇందుకు సంబంధించిన సమాచారం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలితే సదరు గ్యాస్ ఏజెన్సీకి మొదట తెలియజేయాలి. ఆ తర్వాత కంపెనీల నుంచి బాధితులకు సహాయం అందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
ప్రముఖ ఎల్పీజీ కంపెనీలు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ లను కలిగి ఉండటం ద్వారా నష్టాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా శాఖ కార్యాలయం సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.