Zoya Vora Shah: కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటున్నారు. జీవితంపై కొందరు కౌన్సిలింగ్ ఇస్తుండడంతో పాటు పెద్ద పెద్ద చదువులకు అవకాశం రావడంతో చాలా మంది విద్యనభ్యసించి వివిధ రంగాల్లో విజేతలుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.
అంతరిక్షంలోకి అడుడగుపెట్టడానికి సైతం మహిళలు ముందుకు వస్తున్నారంటే వారిలో ఎంతటి ధైర్యసాహాసాలు ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆసక్తికర విషయమేంటంటే మహిళలు ఎన్ని రంగాల్లో రాణించినా వైన్ బిజినెస్ లో మాత్రం వారుడు అడుపెట్టే అవకాశం లేదు. భారత్ లో అయితే ఈ బిజినెస్ వారికి పూర్తి విరుద్దం. కానీ ఓ ఇండియన్ వుమెన్ వైన్ బిజినెస్ లో రాణిస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలని ఉందా..
భారత్ లో పుట్టి పెరిగిన జోయా వోరా షా (Zoya Vora Shah) 20 ఏళ్ల కిందట అమెరికాకు వెళ్లి స్థిరపడింది. మొదట్లో ఆమె ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలోని ఓ రెస్టారెంట్ లో ఆమె పనిచేయడం ప్రారంభించింది. ఈ సందర్భంలో ఆమె వైన్ బిజినెస్ గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత వైన్, స్పిరిట్ అమ్మకాల ప్రతినిధిగా మారారు. వైన్ గురించి తెలుసుకునేందుకు కొన్ని కోర్సులు చేసి సర్టిఫికెట్లు పొందారు. ఆ తరువాత వాషింగ్టన్ డీసీ లోని మోయెట్ హెన్నెస్సీ తదితర పోర్ట్ ఫోలియోలకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని పొందారు.
చివరికి జోయా వోరా షా స్థాపించిన వైన్ కలెక్టివ్ అనేది ప్రీమియం అరిజోనా వైన్ టెస్టింగ్ రూం, వైన్ బార్ గా మారిపోయింది. అరిజోనాలోని స్కౌట్స్ డేల్ టైన్ లో ‘ది వైన్ కలెక్టివ్ ఆఫ్ స్కాట్స్ డేల్’ ఆమె స్థాపించిన 8వ షాప్. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వైన్ ను డిఫెరెంట్ రకాల్లో తయారు చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అయితే ప్రత్యేకమైన వైన్ టేస్ట్ వర్క్ షాప్ ను ప్రారంభించడం అనేది సవాళ్లతో కూడుకున్న పని. కానీ ఒక మహిళ అయి ఉండి జోయా వోరా షా సమర్థవంతగా దీనిని నిర్వహించారు.
అయితే వైన్ బిజినెస్ చేస్తున్న జోయా వోరా షాను చాలా మంది మొదట్లో విమర్శించారు. మహిళ అయి ఉండి.. అదీ ఇండియన్ మహిల ఈ వ్యాపార రంగంలో రాణించడం చాలా మందికి నచ్చలేదు. కానీ జోయా వోరా షా అవేమీ పట్టించుకోలేదు. భర్త ప్రోత్సాహంతో తాను ఇందులో రాణించానని వారికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. చిన్న వ్యాపారంగా మొదలుపెట్టిన వైన్ బిజినెస్ ఇప్పుడు ఆమెకు కోట్లు తెచ్చిపెడుతోంది. అయితే కొత్త రకాల వైన్ ను తయారు చేయడంతోనే ఇది సాధ్యమైందని ఆమె చెబుతూ ఉంటోంది.