Income Vs Property Prices:ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఈ కల నెరవేరాలంటే ఇప్పట్లో అయితే సాధ్యమయ్యే పని కాదని కొందరు అంటూ ఉంటారు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అంటే ఇల్లు కట్టాలంటే చేతిలో డబ్బు ఉండాలని కొందరు అంటుంటే.. బ్యాంకులోను లేదా ఇతర అప్పులు చేసి కూడా కట్టొచ్చని మరికొందరు చెబుతుంటారు. అప్పు చేసి ఇల్లు కట్టడం మంచి మార్గమే. కానీ ఆ అప్పు తీరడానికి అవసరమైన ఆదాయం కూడా ఉండాలి. గత ఐదేళ్లుగా పరిశీలిస్తే ఇల్లు, స్థలాల ధరలు పెరిగాయి కానీ.. అందుకు అనుకూలంగా ఆదాయం పెరగలేదు. దీంతో కొందరు ఆ విషయాన్ని పరిశీలించక ఎక్కువ డబ్బులు పెట్టి ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వాటికి చేసిన అప్పులు తీర్చలేక సతమత అవుతున్నారు. వీరిని చూసిన కొందరు అప్పు చేసి ఇల్లు కొనడం ఎందుకులే? డబ్బులు కూడా పెట్టిన తర్వాత కొందాం? అని అనుకుంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇల్లు, స్థలం కొనలేక పోవడానికి ధరలు కారణం కాదని.. కొందరు ప్రత్యేకంగా చేస్తున్న కొన్ని తప్పులేనని చార్టెడ్ అకౌంట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..
Indian Middle Class Can’t Afford Homes Anymore — And That’s Not an Accident !
Real estate in India is no longer a dream. It’s a rigged game.
Here’s the dark truth the builders, babus, and black money holders won’t tell you:
(A thread every Indian must read) … pic.twitter.com/FS9I184Uam
— CA Nitin Kaushik (@Finance_Bareek) July 20, 2025
చార్టెడ్ అకౌంటెంట్ కౌశిక్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టును ఇలా పెట్టాడు. గత ఐదేళ్లలో ఇల్లు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాదులో 2019లో గజం స్థలం రూ 5,500 కు విక్రయించారు. కానీ 2023లో ఈ ధర రూ. 11 వేలకు పెరిగింది. అంటే దాదాపు 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయి. ఇదే 2019లో ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి 1.5 లక్షలు గా ఉంది. కానీ 2024లో ఆ వ్యక్తి ఆదాయం 1.8 లక్షలకు పెరిగింది. అంటే వ్యక్తి తలసరి ఆదాయం 30% మాత్రమే పెరిగింది. దీనిని బట్టి చూస్తే ధరలకంటే ఆదాయం తక్కువే అని చెప్పవచ్చు. అయితే కొన్ని ఖర్చులు మినహాయించుకొని ఈ ధరలతో ఇల్లు కొనుగోలు చేయవచ్చు.
కానీ జరిగే మరో తప్పు వల్ల ఇల్లు కొనలేక పోతున్నారని కౌశిక్ అభిప్రాయపడుతున్నాడు. వ్యక్తులు స్థలాలు కొనుగోలు చేసిన సమయంలో తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేసుకొని.. ఎక్కువ ధరకు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు డబ్బున్న వారు.. మరికొందరు రియల్ ఎస్టేట్ కు చెందినవారు భూముల క్రయవిక్రయాల కు సంబంధించిన ధరలు పెంచుతూ.. వారి ఆధీనంలోనే భూములు ఉండేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు కావాలన్నా ఆరాటంతో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అప్పులు పెరిగి ఇబ్బంది పడుతున్నారు.
భూములకు సరైన ధరను చెల్లించి రిజిస్ట్రేషన్ ఫీజు సక్రమంగా ప్రభుత్వానికి చెల్లిస్తే ధరలు పెరగవని.. దీంతో సామాన్యుడు సైతం ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని కౌశిక్ తెలిపాడు. కానీ అలా కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు భూముల ధరలను పెంచుతూ సామాన్యులకు భూములు లేకుండా చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి వల్ల వారికే తీవ్ర నష్టం జరిగిందని అంటున్నారు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు అవసరానికి మాత్రమే భూములు కొనుగోలు చేస్తారు. డబ్బున్న వారు వాటిని తిరిగి విక్రయించడానికి కొనుగోలు చేస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసినప్పుడే భూములకు విలువ పెరుగుతుందని కౌశిక్ తెలిపాడు.