https://oktelugu.com/

Income Tax : ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? ఈ ఫైళ్లు పూర్తి చేశారు? గడువు దాటితే ఎలాంటి జరిమానా ఉంటుందో తెలుసా?

భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మితిమీరిన ఆదాయం ఉన్న వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఈ పన్నును చెల్లించేముందు కొన్ని విషయాలను సక్రమంగా చేయాలి. వీటిలో Tax Deducted At Source(టీడీఎస్) పేమేంట్ ను చేయాలి. బ్యాంకు డిపాజిట్లతో పాటు రెండు పేమెంట్లు, కన్సల్టేషన్ ఫీజులు, కమీషన్లు వంటిపై ట్యాక్స్ విధిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2024 11:34 am
    Follow us on

    Income Tax : ఆదాయపు పన్ను చెల్లించే వారు అప్రమత్తం కావాల్సిన సమయమిది. ఇన్ కం టాక్స్ రిటర్న్స్ కు సమయం దగ్గరపడుతుండడంతో వెంటనే పే చేయాల్సిన అవసరం ఉంది. గడవు తేదీ సమీపాన చెల్లించొచ్చు.. అని నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మొదటికే మోసం అవుతుంది. ఎందుకంటే గడువు తేదీ మీరితే రూ. 5000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ను జూలై 31 వరకు గడువు విధించారు. అయితే కొందరు ఈ గడువును పెంచారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఐటీ విభాగం ఆ వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఐటీ రిటర్న్స్ కు ఎలాంటి గడుపు పెంచలేదని స్పష్టం చేసింది. దీంతో జూలై 31 లోపు మాత్రమే చెల్లించాలి. కొందరు ఆన్ లైన్ లో పన్ను చెల్లించడం వల్ల సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. కానీ ఈ వెబ్ సైట్ లోని పన్ను చెల్లించే పోర్ట్ లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఐటీ విభాగం తెలుపుతోంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరింది. కొందరు ఐటీ రిటర్న్స్ చెల్లించడం ద్వారా రిఫండ్ వస్తుందంటూ ఫేక్ మెసేజ్ లు పంపిస్తున్నారని, ఇలాంటి మెసేజ్ లను క్లిక్ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఇన్ కం టాక్స్ వెబ్ సైట్ లేదా సంబంధింత నిపుణుల ద్వారా మాత్రమే పన్ను చెల్లించాలని ఐటీ విభాగం తెలిపింది. అయితే ఆదాయపు పన్నును చెల్లించేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలని కొందరు నిపుణలు పేర్కొంటున్నారు. అవేంటంటే?

    భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మితిమీరిన ఆదాయం ఉన్న వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఈ పన్నును చెల్లించేముందు కొన్ని విషయాలను సక్రమంగా చేయాలి. వీటిలో Tax Deducted At Source(టీడీఎస్) పేమేంట్ ను చేయాలి. బ్యాంకు డిపాజిట్లతో పాటు రెండు పేమెంట్లు, కన్సల్టేషన్ ఫీజులు, కమీషన్లు వంటిపై ట్యాక్స్ విధిస్తారు. రాబడులు, పెట్టుబడులపై టీడీఎస్ రేటు 1 శాతం ఉంటుంది. క్రిప్టో కరెన్సీలపై 30 శాతం విధిస్తారు. అయితే టీడీఎస్ ఫైల్ ను ముందుగానే పూర్తి చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

    ప్రతీ ఏడాదికి ఒకసారి జీఎస్టీ ఆర్ 4 ఫైలింగ్ చేస్తారు. దీనిని వస్తు సేవల పన్ను గా పేర్కొంటారు. గతంలో మూడు నెలలకు ఒకసారి వస్తు సేవల పన్నును చెల్లించేవారు. కానీ 2022 నుంచి ప్రతీ ఏడాది చెల్లించాలని నిర్ణయించారు. అయితే గడువు తేదీలోపు ఈ ఫైల్ చేయాలి. లేకుండా అదనంగా రోజుకు రూ.50 చొప్పున ఫైన్ పడుతుంది. గరిష్టంగా ఇది రూ.2 వేలు కూడా ఉండొచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వాటిపై రూ.40వేల ఆదాయం వస్తే వాటినుంచి బ్యాంకులు టీడీఎస్ కట్ చేస్తాయి. అయితే రూ.40 వేల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నప్పుడు సెల్ప్ డిక్లరేషన్ ఫామ్ 15జీ, 15 మెచ్ ను సమర్పించాలి. ఇది ఇవ్వడం వల్ల బ్యాంకులు టీడీఎస్ కట్ చేయకుండా ఉంటాయి.

    గడువు ముగిసిన తరువాత ఎలాంటి ఫైల్ చేసిన రూ.5 వేల వరకు ఫెనాల్టీ పడుతుంది. చిన్న పేయర్లకు రూ.1000 లోపే అమౌంట్ కట్టాలి. ఇది కూడా గడువు దాటినా ఫైన్ వేస్తారు. ఆదాయపు పన్ను చట్టం 1961సెక్షన్ 139(1) ప్రకారం రూ. 3 లక్షల వరకు ఫెనాల్టీలు మిహాయింపు ఉంటాయి. ఆపైన చెల్లించే వారు కచ్చితంగా కట్టాల్సిందే. విదేశీ ఆస్తులు కలిగిన వారు సైతం దీని నుంచి తప్పించుకోలేదు.