Loan: ఈ 5 ఉంటే చాలు.. ఏ లోనైనా రావాల్సిందే.. అవేంటంటే?

లోన్ రావాలంటే మాత్రం కొన్నింటిని జాగ్రత్తగా పాటించాలి. రుణ ప్రక్రియలో ‘సిబిల్ స్కోర్’ లేదా ‘క్రెడిట్ స్కోర్’ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా మీ రుణాన్ని చేరుకునే మార్గం సుగమం అవుతుంది. దీన్ని జాగ్రత్తగా మెయింటెన్ చేస్తే ఏ బ్యాంకు అయినా మీ ముందుకు వచ్చి మరీ లోన్ ఇస్తుంది.

Written By: Neelambaram, Updated On : May 14, 2024 5:29 pm

Loan

Follow us on

Loan: ఆర్థిక పరంగా తక్షణం ఆదుకునేది ఏంటని విచారిస్తే అది ‘లోన్‘ మాత్రమే. ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఉన్నత చదువుల కోసమైనా, విదేశాలకు వెళ్లాలన్నా, పర్సనల్ ఖర్చుల కోసమైన లోన్ ఉంటే ఆ భరోసా మరోలా ఉంటుంది. బ్యాంకులకు కూడా ఎక్కువ ఆదాయం సమకూరేది లోనుల వల్లే.

అయితే లోన్ రావాలంటే మాత్రం కొన్నింటిని జాగ్రత్తగా పాటించాలి. రుణ ప్రక్రియలో ‘సిబిల్ స్కోర్’ లేదా ‘క్రెడిట్ స్కోర్’ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా మీ రుణాన్ని చేరుకునే మార్గం సుగమం అవుతుంది. దీన్ని జాగ్రత్తగా మెయింటెన్ చేస్తే ఏ బ్యాంకు అయినా మీ ముందుకు వచ్చి మరీ లోన్ ఇస్తుంది.

‘సిబిల్ స్కోర్’ ఎక్కువగా ఉంటే టెన్షన్ ఉండదు..
ఆర్థిక అంశాల పరంగా వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా.. ‘సిబిల్ స్కోర్’ లేదా ‘క్రెడిట్ స్కోర్’నే చూడాలి. అవి మంచిగా ఉన్నప్పుడు, బ్యాంకు వెంటనే రుణాన్ని అందిస్తుంది. కానీ తక్కువగా ఉంటే లోన్ పొందడం కష్టమవుతుంది. మీకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా లేదంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ను తనిఖీ చేసుకోవాలి. మీ సిబిల్ ఎంత ఎక్కువగా ఉంటే, మీకు రుణం ఇవ్వడం అంత సులభం. సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే మంచి కేటగిరీలోకి వస్తుంది.

సిబిల్ స్కోర్ గణాంకాలు దేన్ని సూచిస్తాయి?
మనం చేసే లావాదేవీలపైనే సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మన ఆర్థిక క్రమ శిక్షన ఆధారంగా ఈ స్కోర్ పెరుగుతుంది.. తగ్గుతుంది. కాబట్టి ఈ డేటాను విశ్లేషిస్తే మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించగలుగుతారని, చెల్లించడంలో ఆలస్యం చేయరని బ్యాంకులు అంచనా వేస్తాయి. అంటే, మీకు రుణం ఇచ్చేందుకు బ్యాంకులకు మీపై వచ్చే నమ్మకమే సిబిల్ స్కోర్. సాధారణంగా బ్యాంకులు నిర్ధేశించిన ప్రమాణాలను పరిశీలిస్తే ఏ వ్యక్తి క్రెడిట్ స్కోరైనా 300 నుంచి 900 పాయింట్ల మధ్య, సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే ఉత్తమ క్రెడిట్ స్కోర్ గా పరిగణిస్తారు.

తక్కువ స్కోర్ ఉంటే అంతే సంగతులు..
మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా, అంటే 700 కంటే తక్కువగా ఉంటే మీరు రుణం పొందడం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, దాన్ని సవరించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
*మొదటిది మీ ఈఎంఐలు లేదా బకాయిలను సకాలంలో చెల్లించాలి.
*మీకు ఇప్పటికే హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఆటో లోన్ వంటివి ఉంటే.. క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నా.. సకాలంలో చెల్లించడం వల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది.
*మీ సిబిల్ ను క్రమపద్ధతిలో ఉంచేందుకు ఉత్తమ మార్గం రుణం యొక్క ఈఎమ్ఐ చెల్లింపులో ఆలస్యం చేయకుండా, సకాలంలో చెల్లించడం.

క్రెడిట్ కార్డులు వాడేప్పుడు జాగ్రత్త..
నేడు ఏ వ్యక్తి చేతిలో చూసినా క్రెడిట్ కార్డులు దర్శనం ఇస్తున్నాయి. బ్యాంకులు కూడా ఎక్కువ మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. తమ అవసరాలు తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డు పెద్ద సాధనంగా మారింది. వాటితో ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ లిమిట్ ను జాగ్రత్తగా వాడాలి. బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ కార్డు లిమిట్ ను పూర్తిగా వాడద్దు. పెద్దగా అవసరం లేకపోతే, 30-40 శాతం ఉపయోగించండి.

ఒకేసారి ఎక్కువ రుణాలు మంచిది కాదు..
మీ సిబిల్ స్కోర్ ను పెంచుకోవాలంటే మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఒకే కాల వ్యవధిలో ఎక్కువ లోన్లను తీసుకోవద్దు. ఇది మంచిది కాదు.. దీంతో మీ సిబిల్ స్కోర్ భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం, ఆ తర్వాత వాటి చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం కనిపిస్తుంది. అలా చేయడం వల్ల మీ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది.
అటువంటి పరిస్థితిలో మీరు కొత్త రుణం తీసుకోవాలనుకుంటే, మొదట పాత రుణాలను తిరిగి చెల్లించిన తర్వాతే దరఖాస్తు చేయండి.

అవసరాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి..
మీ క్రెడిట్ రేటింగ్ ను మెరుగు పరుచుకునేందుకు, మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగేంత రుణం బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ రుణాలు తీసుకున్నప్పుడు ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. మీరు దాని చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే.. అది నేరుగా మీ సిబిల్ స్కోరును ప్రభావితం చేస్తుంది. సిబిల్ స్కోర్ బాగోలేకపోతే కొత్త లోన్ లో సమస్య వస్తుంది. మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఇది అంతరాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది, సరైన సమయంలో తగిన దిద్దుబాట్లు చేసుకునే వీలు కల్పిస్తుంది.