https://oktelugu.com/

IDFC First Bank: ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్ సీ విలీనం.. ఇప్పుడు వాటి షేర్లు ఎలా ఉన్నాయంటే?

ఐడీఎఫ్ సీ బ్యాంకును ప్రారంభించడానికి 2014లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. 2015లో ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు తన కార్యకలాపాలను ప్రారంభించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 4, 2023 1:24 pm
    IDFC First Bank

    IDFC First Bank

    Follow us on

    IDFC First Bank: బ్యాంకుల విలీనం కార్యక్రమం జోరుగా సాగుతోంది. గతంలో యూనియన్ బ్యాంకులో పలు ప్రైవేట్ బ్యాంకులు కలిసిపోగా.. ఇటీవల హెడీఎఫ్ సీ బ్యాంకులో హెడీఎఫ్ సీ లిమిటెడ్ విలీనం అయింది ఇదే దారిలో మరో బ్యాంకు లిమిటెడ్ సంస్థను బ్యాంకులో కలిపేసుకోబోతుంది. ప్రముఖ ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్ సీ లిమిటెడ్ కలిసిపోతుంది. ఈ విలీనానికి రెండు బోర్డులు ఆమోదం తెలిపాయి. ఇప్పటి నుంచి షేర్ల మార్పిడి ద్వారా ఐడీఎఫ్ సీతో లావాదేవీలు చేయనున్నట్లు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది ఎండింగ్ లోగా ఈ రెండు వీలీనం జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్ సీ లిమిటెడ్ 40 శాతం వాటాను కలిగి ఉంది.

    ఐడీఎఫ్ సీ బ్యాంకును ప్రారంభించడానికి 2014లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. 2015లో ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు తన కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే 2018లో ఐడీఎఫ్ సీ బ్యాంకు, క్యాపిటర్ ఫస్ట్ తో విలీనం అయింది. దీంతో ఐడీఎఫ్ సీ బ్యాంకుగా ఉన్న ఈ సంస్థ ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకుగా అవతరించింది. ఇక 1997లో ఐడీఎఫ్ సీ లిమిటెడ్ ఆవిర్భవించింది. మైలిక రంగానికి రుణాలు అందించేందుకు ఆ సమయంలో ఏర్పాటు చేశారు. ప్రస్తతం ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంకులో 39.3 శాతం వాటాను ఫస్ట్ బ్యాంకులో కలిగి ఉంది. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్ సీ వాటాదారులకు తమ వద్ద ఉన్న ప్రతీ 100 షేర్లకు గాను 155 ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు షేర్లను జారీ చేయనున్నారు.

    ఈ సందర్భంగా ఐడీఎప్ సీ ఫస్ట్ బ్యాంకు ఎండీ, సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ గత మార్చి 31 నాటికి మా బ్యాంకు 1.6 ట్రిలియన్ రుణాలు ఇచ్చినట్లుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1.6 లక్ష కోట్ల డిపాజిట్ ప్రాంచైజ్, డిజిటల్ ఇన్నోవేషన్, కస్టమర్ల ప్రాడెక్ట్ తదితర వంటి పునాదిని నిర్మిస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇక సోమవారం ట్రెడింగ్ ముగిసే సమయానికి ఐడీఎఫ్ సీ షేర్లు రూ.7 లాభంతో రూ.10.90 వద్ద ముగిసింది. ఇక ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు షేర్ 2.9 శాతం లాభంతో రూ.81. 70 వద్ద ఆగింది.

    ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంకులో ఐడీఎఫ్ సీ విలీనం కావడానికి ఆర్ బీఐ, సెబీ, సీసీఐ, ఎన్ సీఎల్ టీ లతో పాటు ఇతర రెగ్యులేటరీలు, షేర్ హోల్డర్ల నుంచి ఆమోద ముద్ర రావాల్సి ఉంది. వీటికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది చివరి లోగా ఈ ప్రక్రియ ముగుస్తుందని, ఆ తరువాత విలీనం జరుగుతుందని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.