Hyundai Cars: కార్ల వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. పండుగల సందర్భంగా తాజాగా హ్యుందాయ్ కంపెనీకి చెందిన కొన్ని కార్లపై కంపెనీ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఒక్కో కారుపై కనీసం రూ.50 వేల వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కంపెనీలోని ఏయే కార్లపై ఎం తగ్గింపు ప్రకటించారో తెలుసుకుందాం..
హ్యుందాయ్ i20 N లైన్:
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ తో కూడి ఉంది. 172 ఎన్ ఎం టార్క్ తో పాటు 120 హెచ్ పీ ఉత్పత్తి చేస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి ఫేస్ లిస్ట్ ను కలిగి ఉంది. దీనిని రూ.9.99 లక్షల ప్రారంభం ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఈ కారుపై రూ.10,000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్:
ఈ మోడల్ 1.2 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ యూనిట్ తో కలిగి ఉంది. 113 ఎన్ ఎం టార్క్ తో పాటు 83 హెచ్ పీ, 93 ఎన్ ఎం టార్క్ ను 69 హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏంఎంటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఇది మారుతి స్విప్ట్, టాటా టియాగోలకు గట్టి పోటీ ఇస్తోంది. దీనిని రూ.5.84 లక్షల షోరూం ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై రూ.43000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది.
హ్యుందాయ్ ఆరా:
ఆరా అనేది గ్రాండ్ ఐ 10 నియోజ్ హ్యాచ్ బ్యాక్ ఫీచర్లనే కలిగి ఉంది. ఇది మారుతి సుజుకీ డిజైర్ కు గట్టిపోటీ ఇస్తుంది. మ్యుందాయ్ ఆరాను రూ.6.43 లక్షల ప్రారంభ ధరతో ఇస్తున్నారు. దీనిపై రూ.33 వేల వరకు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
హ్యుందాయ్ వెర్నా:
1..5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 160బీహెచ్ పీ, 253 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తిని విడుదల చేస్తున్న ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. వోక్స్ వ్యాగన్ వర్టస్ కు ఇది గట్టి పోటీ ఇస్తోంది. దీనిని రూ.10.96 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తుండగా.. దీనిపై రూ.25000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అల్కాజార్:
1.5 లీటర్ సీఆర్ డీఐ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ శక్తిని కలిగి ున్న ఇది 250 ఎన్ ఎం టార్క్ తో పాటు 116 బీహెచ్ పీ ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కు కలిగిన ఈ మోడల్ పై రూ.20 వేల వరకు ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది.