Hyundai Venue Bumper discount: కొత్త ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్.. హ్యుందాయ్ తమ సెకండ్ హయ్యెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ వెన్యూ మీద ఈ జూలై నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. జూలై 2025 నెలలో హ్యుందాయ్ వెన్యూని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఏకంగా రూ.85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ గురించి మరింత సమాచారం కోసం దగ్గర్లోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.
Also Read : ఆ విషయంలో ప్రభాస్ అంత ఎమోషనల్ అయ్యాడు ఏంటి..? వైరల్ వీడియో…
ఫీచర్ల విషయానికి వస్తే హ్యుందాయ్ వెన్యూలో అనేక లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందులో 8.0 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం, 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు.
ఈ కారు పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే హ్యుందాయ్ వెన్యూలో మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 83bhp పవర్‌ను, 114Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండోది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఇది 120bhp పవర్‌ను, 172Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడవది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 100bhp గరిష్ట పవర్‌ను, 240Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆప్షన్లు వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్టుగా సెలక్ట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి.
Also Read : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్టేట్
భారత మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుండి టాప్ మోడల్‌లో రూ.13.62 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ, మార్కెట్‌లో టాటా పంచ్, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి ఇతర ప్రముఖ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.