Hyundai Exter SUV: Hyundai కంపెనీ నుంచి సరికొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. Hyundai Exter SUV అయిన ఇది టుక్సాన్, వెన్యూ మోడల్ కు పోటీగా ఉండే అవకాశం ఉంది. SUV లల్లో అత్యంత రిచ్ గా వస్తున్న దీనిపై కంపెనీ భారీ ఆశలే పెట్టుకుంది. ఇటీవల SUVలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదు.. గానీ ఈ మోడల్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ కంపెనీలు సైతం SUV లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ తరుణంలో Hyundai Exter SUV ని విక్రియిస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా దీనిని రూ.11 వేల టోకెన్ తోనే బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.
Hyundai Exter SUV అలాయ్ వీల్స్ ను కలిగి ఉంది. సీ పిల్లర్ కు డ్యూయెల్ టోన్, బ్లాక్ రూప్ రెయిల్స్ ఉంటాయి. టెయిల్ లైట్స్ కి H షేప్ డీఆర్ ఎల్స్ లభిస్తుంటాయి. ఫ్రంట్ లైట్స్ ఇవి ఉన్నట్లు డిజైన్ రెండర్ లో తెలుస్తోంది. అరౌండ్ టెయిల్ లెట్స్, ఫ్రంట్ లో ఎల్ ఈడీ యూనిట్ తరహా హెడ్ లైట్స్ ఉంటాయి. రెండ్ ప్రకారం ఫ్రంట్ లో పారా మెట్రిక్ పాటర్న్ తో కూడిన గ్రిల్ ఉంటుంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. EX, S, SX, SX(O), SX(O)Connetctలల్లో లభిస్తోంది.
ఆన్లైన్లో లీక్ అయిన Hyundai Exter SUV ధర రూ.6 లక్సలు ఎక్స్ షో రూం ధర ఉండొచ్చని అంటున్నారు. అయితే పూర్తి వివరాలు రిలీజ్ చేసే సమయానికి వెల్లడించే అవకాశం ఉంది. టాటా పంచ్, సిట్రోయేన్ సీ3, మారుతి సుజుకి ఇగ్నిస్, మోడల్స్ కు Hyundai Exter SUV గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. Hyundai Exter SUV స్పెషిఫికేషన్స్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (5 స్పీడ్ మేన్యువ్ ట్రాన్స్ మిషన్)1.2 లీటర్ బై ప్యూయల్ పెట్రోల్ లలో ఉంటుంది.
ఇక దీనిని బుక్ చేసుకునేందుకు కేవలం రూ.11వేల టోకెన్ అందుబాటులో ఉంటోంది. ఇప్పటికే Hyundai Exter SUV బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. గ్రాండ్ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. Hyundai Exter SUV భారత ఆటోమొబైల్ రంగంలోనే హాట్ టాపిక్ గా నిలుస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే మార్కెట్లోకి వచ్చిన తరువాత ఇది ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.