Hyundai Creta : ఆటో మొబైల్ మార్కెట్లోకి SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా వచ్చి పదేళ్లు అయింది. ఏప్రిల్ 2025లో కూడా ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. ఇలా జరగడం ఇది వరుసగా రెండో నెల. హ్యుందాయ్ క్రెటా హవా చూస్తే.. గత 10 ఏళ్లుగా ఈ కారు మార్కెట్‌లో ఒక ఊపు ఊపుతోంది. దీన్ని ఢీకొట్టడానికి మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి పెద్ద కంపెనీల కార్లు కూడా ప్రత్యేకంగా ఏం
హ్యుందాయ్ క్రెటాను మొదటిసారిగా 2015లో విడుదల చేశారు. భారతదేశంలో SUVలకు క్రేజ్ పెంచిన తొలి కార్లలో ఇది ఒకటి. ఇప్పటికీ దీని హవా కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ మోటార్స్ ఏకంగా 17,016 క్రెటా యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది ఏప్రిల్‌లో అమ్ముడైన 15,447 యూనిట్ల కంటే 10.2 శాతం ఎక్కువ. 2025 ప్రారంభంలోని 4 నెలల్లోనే ఇది అమ్మకాలలో రికార్డులు సృష్టించింది.
Also Read : గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో భారత్ దూకుడు.. టాప్ 10లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
2025లో ప్రతిరోజూ ఇన్ని కార్లు అమ్ముడయ్యాయా?
హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్‌లో మాత్రమే కాదు.. మార్చిలో కూడా దేశంలో నంబర్-1 SUVగా నిలిచింది. 2025 జనవరి-ఏప్రిల్ హోల్‌సేల్ అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. హ్యుందాయ్ మొత్తం 69,914 క్రెటా యూనిట్లను విక్రయించింది. అంటే, 120 రోజుల్లో కంపెనీ ప్రతిరోజూ సగటున 582 కార్లను అమ్మగలిగింది.
కంపెనీకి కాసులు కురిపించే మోడల్ ఇదే
హ్యుందాయ్ మొత్తం అమ్మకాల్లో SUVల వాటా 70.9 శాతానికి చేరుకుంది. క్రెటాతో పాటు కంపెనీ వెన్యూ, అల్కాజార్, ఎక్స్‌టర్, టక్సన్ వంటి మోడళ్లను కూడా విక్రయిస్తోంది. కానీ, కంపెనీకి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే మోడల్ మాత్రం క్రెటానే. గత 10 ఏళ్లలో కంపెనీ దీనికి సంబంధించిన 12 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది.
మారుతి, టాటా పోటీ ఇవ్వలేకపోయాయా?
హ్యుందాయ్ క్రెటా 3 ఇంజన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్, 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 157 bhp పవర్, 253 Nm టార్క్‌ను అందిస్తుంది. అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 114 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.11.11 లక్షలు.
దీనికి పోటీగా ఇప్పుడు మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టాటా మోటార్స్ కర్వ్ వంటి మోడళ్లు ఉన్నప్పటికీ అమ్మకాల విషయంలో క్రెటాను ఏదీ అందుకోలేకపోతోంది. అంతేకాదు, హ్యుందాయ్ సిస్టర్ కంపెనీ అయిన కియా ఇండియాకు చెందిన సెల్టోస్ కూడా మార్కెట్‌లో ఉన్నప్పటికీ అమ్మకాల పరంగా క్రెటాను అందుకోలేకపోయింది.