Hyundai Aura : ఇంటి అవసరాలతో పాటు కార్యాలయానికి అనుగుణంగా ఉండాలని చాలా మంది సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా 4 వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొంటున్నప్పటికీ.. కొన్ని సెడాన్ కార్లు కూడా అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటున్నాయి. వీటితో పాటు SUV మోడళ్లు క్రేజీని సంపాదించుకుంటున్నాయి. అయితే కొత్తగా సెడాన్ కాంపాక్ట్ కార్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇవి పెట్రోల్ తో పాటు CNG వేరియంట్ ను కలిగి అత్యధిక మైలేజ్ ను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో Hyundai కంపెనీకి చెందిన ఓ కారు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ కారు విశేషాలేంటో తెలుసుకుందాం..
Sedan కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మారుతి సుజుకీ, హోండా వంటి కంపెనీలు ప్రత్యేకత సాధించాయి. ఈ కార్లకు పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ అరా కారు మార్కెట్లోకి వచ్చి అలజడి సృష్టించింది. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ లో మార్కెట్లోకి వచ్చి నేటి వినియోగదారులకు అనుగుణంగా ఉంటోంది. ఈ కారులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, సరసమైన ధరలోనే దీనిని దక్కించుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ లో ఇది నెంబర్ వన్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.
తాజాగా Hyundai Aura Corporate మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. 6.5 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు వైర్ లెస్ కార్ కనెక్టివిటీని అందిస్తాయి. ఆటోమేటిక్ ఏసీ, ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్స్, మల్టీ ఫంక్షన్ హాల్ స్టీరింగ్ వీల్ తో పాటు అద్భుతంగా అనిపించే సైడ్ మిర్రర్స్ ఇందులో అమర్చబడ్డాయి. ఎక్సీటీరియర్ విషయానికొస్తే 15 అంగుళాల స్టైలీష్ వీల్స్, బాడీ కలర్డ్ హ్యాంిల్స్, రియర్ స్పాయిలర్ ఉన్నాయి.
ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఆఇది 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 114 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పానిచేస్తుంది. ఇక సీఎన్ జీ వెర్షన్ లో ఈ కారు 68 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. సింగిల్ సిలిండర్ తో ఉన్న ఈ కారు లీటర్ ఇంధనానికి 28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సేప్టీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్ లను అమర్చారు. అలాగే ఏబీఎస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్ వంటివి ఉన్నాయి.
ప్రస్తుతం Hyundai Auara Corporateని రూ.7.48 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.8.47 లక్షలకు అమ్ముతున్నారు. అయితే దీనిని దక్కించుకోవాలంటే ప్రీబుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ని అన్ని హ్యుందాయ్ షోరూంల్లో ఇది అందుబాటులో ఉంది.