https://oktelugu.com/

Aadhar Card: ఆధార్ కార్డులో మీ ఫోటో నచ్చలేదా? ఫోటో ఎలా మార్చుకోవాలంటే?

Aadhar Card:  మన దేశంలోని ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ సేవలను పొందాలన్నా ఆధార్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. 12 అంకెలతో కూడిన ఆధార్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనలో చాలామంది ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఆధార్ లోని ఫోటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 19, 2022 / 04:00 PM IST
    Follow us on

    Aadhar Card:  మన దేశంలోని ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ సేవలను పొందాలన్నా ఆధార్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. 12 అంకెలతో కూడిన ఆధార్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనలో చాలామంది ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఆధార్ లోని ఫోటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.

    అయితే ఆధార్ కార్డులోని ఫోటోను సైతం సులభంగా మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలని భావించే వాళ్లు మొదట యూఐడీఏఐ వెబ్ సైట్ కు వెళ్లి ఆధార్ ఎన్ రోల్ మెంట్, కరెక్షన్, అప్ డేట్ ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను పొందుపరిచి ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆ ఫారంను సమర్పించాలి. ఆధార్ సెంటర్ నిర్వాహకులు కొత్త ఫోటో తీసుకోవడంతో పాటు బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేస్తారు.

    ఆ తర్వాత జీఎస్టీతో పాటు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ సెంటర్ నిర్వాహకులు ఇచ్చే అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించకుండానే ఫోటోను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డును కొత్త ఫోటోతో డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు యూఐడీఏఐ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

    ఆ తర్వాత ఆధార్ నంబర్ లేదా ఎన్ రోల్ మెంట్ ఐడీని ఎంటర్ చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.