Home Tax Save : సొంత ఇల్లు ఉన్నవారు ఇలా చేస్తే ట్యాక్స్ మినహాయింపు..

ఇలా దీర్ఘకాలికంగా ఆస్తులను హోల్డింగ్ ఉంచి ఆ తరువాత వచ్చిన లాభంతో ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.

Written By: Suresh, Updated On : October 7, 2023 3:16 pm
Follow us on

Home Tax Save : సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అవసరం మేరకు డబ్బు లేకపోవడంతో ఎలా అని ఆలోచిస్తారు. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు రుణాలు ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తాయి. మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. అయితే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు, ఇతర ఆస్తులను ద్వారా లేదా పెట్టుబడులు పెట్టిన వాటి ద్వారా వచ్చిన లాభాల మొత్తం అయితే టాక్స్ పడుతుంది. కానీ ఇతర ఆస్తులను విక్రయించి ఇల్లు కొనడం ద్వారా భారీగా టాక్సీ నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇది కనీసం రూ.2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అదెలాగో తెలుసుకోండి..

ఇల్లు నిర్మించుకోవడానికి సరైన సమయం లేకపోవడంతో చాలా మంది రెడీమేడ్ ఇల్లును కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే కొందరు ఇల్లు కొనకముందు బంగారం, మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టుబడు పెడతారు. ఈ డబ్బును డ్రా చేసుకొని ఇతర అవసరాలకు వాడుకుంటే ట్యాక్స్ విధిస్తారు. కానీ ఇవే పెట్టుబడులు ఇల్లు కొనుగోలు చేస్తే ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 54 కింద కొత్త ఇల్లు కొనడానికి ఇతర నివాస ప్రాపర్టిని విక్రయించి వచ్చిన సొమ్ముతో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఆస్తి పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

ఉదాహరణకు ఒకచోట స్థిర నివాస ఆస్తి భూమి లేదా బంగారం, మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులతో వచ్చిన లాభాలతో ఇల్లును కొనుగోలు చేయడం ద్వారా 54 F సెక్షన్ కింద పన్నుమినహాయింపు ఉంటుంది. అయితే ఇలా మినహాయింపు కావడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఏవైతే పెట్టుబడులతో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారో.. అవి దీర్ఘకాలిక మూలధనం అయి ఉండాలి. అంతేకాకుండా విక్రయించాల్సిన ఆస్తి ఎంతకాలం హోల్డింగ్ పీరియడ్ లోఉంది? అనేది చూస్తారు. ఆ తరువాత ఎంతకాలానికి అమ్మారు? అనేది కౌంట్ చేస్తారు.

ఒక షేర్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసిన 12 నెలల తరువాత విక్రయిస్తే అది దీర్ఘకాలిక మూలధనం అవుతుంది. దీనిపై 10 శాతం పన్ను ఉంటుంది. కానీ ఈ మూలధనంతో ఇల్లును కొనుగోలు చేస్తే 54 F సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది. అలాగే ఎల్ టీసీజీ కోసం, బంగారం 36 నెలల పాటు ఉంచితే వీటిపై పడే ట్యాక్స్ ఆదా అవుతుంది. ఇలా దీర్ఘకాలికంగా ఆస్తులను హోల్డింగ్ ఉంచి ఆ తరువాత వచ్చిన లాభంతో ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.