Mahindra Cars : ప్రపంచ దేశాలతో భారత్ వివిధ రంగాల్లో పోటీ పడుతూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా ఆటోమోబైల్ రంగంలో చైనా, జపాన్,కొరియా వంటి దిగ్గజాలకు ధీటుగా భారతీయ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇండియాకు చెందిన కొన్ని కంపెనీలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రశంసలు పొందుతున్నాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్యాసింజర్, వ్యవసాయ, ట్రక్కులను అందుబాటులోకి తీసుకొచ్చిన మహీంద్రా గ్లోబల్ మార్కెట్లో తన ప్రతాపం చూపిస్తోంది. Jeep నుంచి మొదలైన మహీంద్రా వాహనాల ప్రస్థానం నేటి Thor Roxx వరకు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీటిలో థార్ వంటి వెహికల్స్ అయితే జగజ్జేతగా నిలిచాయని చెప్పవచ్చు. గ్లోబల్ లెవల్లో ఎన్నో కంపెనీలు కొత్త కార్లు తీసుకొచ్చినా మహీంద్రా వెహికల్స్ కు ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. అందుకు కారణాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి…
-1945లో మొదలు..
1945లో మహీంద్రా ప్రస్థానం మొదలైంది. దీనిని మొదటగా లూథియానాలో అక్టోబర్ 2న మహీంద్రా సోదరులు కైలాష్ చంద్ర మహీంద్రా, జగదీష్ మహీంద్రా సోదరులు మహమ్మద్ తో కలిసి స్థాపించారు. ఆ తరువాత కైలాష్ చంద్ర మహీంద్రా మనువడు ప్రస్తుత ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఈ కంపెనీ ఇండియాలో కొనసాగుతోంది. మహీంద్రా నుంచి 1970లో జీప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్యాసింజర్ మాత్రమే కాకుండా వ్యవసాయ, ట్రక్కులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇండియాలో 13 మహీంద్రా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 పికప్ ట్రక్కులు, 9 ఎస్ యూవీ కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా త్వరలో మహీంద్రా థార్ రాక్స్, బొలెరో 2024, ఎక్స్ యూవీ 900 త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.
– అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు క్రేజ్?
ఎస్ యూవీ దిగ్గజం మహీంద్రా కంపెనీ దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ తో కనెక్ట్ అయి ఉంది. 2008 లో మహీంద్రాకు చెందిన స్కార్పియోను మొదటి సారిగా ఈజిప్టులో ప్రవేశపెట్టారు. అక్కడి భవారియా ఆటో గ్రూప్ తో కలిసి దీనిని విడుదల చేవారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సహా 30 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. వీటిలో 10 దేశాల్లో 100 కంటే ఎక్కువ సొంత డిస్డ్రిబ్యూషన్ తో వాహనాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లోకి మొత్తం 4 లక్షల యూనిట్లను ఎగుమతి చేసి బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. 2024లో అంతర్జాతీయ మార్కెట్ 2,820 మిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2024 నుంచి 2028 మధ్యలో ఆదాయం 1.92 శాతం వార్షిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీని ఫలితంగా 2028 నాటికి 3,043 మిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు.
-మహీంద్రా కార్ల తయారీ క్వాలిటీ అమోఘం..
మహీంద్రా కార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మిగతా కార్ల కంటే మహీంద్రా కార్లు నాణ్యతగా ఉంటాయి. ఈ కంపెనీ ఎక్కువగా ఎస్ యూవీలనే ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి రిలీజ్ అయ్యే చిన్న వాహనాలు సైతం కేర్ తీసుకుంటారు. మహీంద్రా XUV300 కారులో హై టెన్సైల్ స్టీల్ ను ఉపయోగించారు. ఇది ప్రయాణికులకు ఎంతో భద్రత ఇస్తుంది. అలాగే క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్లను తయారు చేస్తారు.
-అందుకే అత్యంత ధర
మహీంద్రా కార్లు సామాన్యుడికి దూరంగానే ఉంటాయి. ఈ కంపెనీ కార్లలో అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలను ఉపయోగిస్తుంటారు. కొండలు, కోనల్లో సైతం దూసుకుపోయేలా స్ట్రక్ కాకుండా వీటిని తయారు చేస్తారు. మహీంద్రా నుంచి భారత మిలటరీకి కొన్ని వాహనాలు వెళ్లాయి. అంటే యుద్ధ సమయంలోనూ ఈ కార్లు తట్టుకునే విధంగా తయారు చేస్తుంటారు. అందుకే ఈ కార్ల ధరలు అకాశాన్నిఅంటుతుంటాయి. ఎస్ యూవీ విభాగంలో మహీంద్రా నుంచి ఎక్స్ యూవీ 400 రూ. 15.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
-అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉండడం మహీంద్రా కార్ల ప్రత్యేకత
కారు కొనాలనుకునే వారు ముందుగా ఫీచర్లను చూస్తారు. ఫీచర్లను అందివ్వడంలో మహీంద్రా వెనక్కి తగ్గదు. ఇంటర్నేషనల్ లెవల్లో వినియోగదారులు ఆకట్టుకునే విధంగా దీని ఫీచర్లు ఉంటాయి. మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ లో 5 సీటర్ తో పాటు వివిధ రకాల ఆకట్టుకునే ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. అలాగే మహీంద్రా XUV300 మోడల్ లో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి.
-భారతీయ అభిరుచికి తగ్గట్టు కార్ డిజైన్లు
భారత్ లో ఉండే వాహనదారులు కాస్త రాష్ డ్రైవింగ్ కోరుకుంటారు. వారికి అనుగుణంగాన మహీంద్రా కార్లు ఉంటాయని చెప్పవచ్చు. వీటిలో మహీంద్ర జీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దూర ప్రాంతాలతో పాటు ఎత్తైన ప్రదేశాలకు మహీంద్రా కార్లకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. భారతీయులు ఎటువంటి కార్లు కోరుకుంటున్నారో అలాంటి కార్లు మార్కెట్లోకి తీసుకురావడం ఈ కంపెనీ ప్రత్యేకత.
ఇక మహీంద్రా XUV300 రిలీజ్ సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర మాట్లాడుతూ ‘తాను అంతర్జాతీయ స్థాయిలో కార్లను ప్రవేశపెడుతున్న తరుణంలో టోయోటా వంటి కంపెనీలు తనను తప్పుకోవాలని అన్నారని’ అన్నారు. దీంతో మహీంద్రాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More