Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు డబ్బే డబ్బు..

2024 మే 25 శనివారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 25, 2024 7:50 am

Horoscope

Follow us on

Horoscope Today: 2024 మే 25 శనివారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో తుల, కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు నిరాశతో ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
వ్యాపారస్తులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభ రాశి:
ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు ఉంటాయి. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల వారు ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

కర్కాటక రాశి:
ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు.

సింహారాశి:
అనవసర వాదనలకు దిగొద్దు. కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పెరుగుతుంది. చేసే పనిపై శ్రద్ధ వహించాలి. కెరీర్ విషయంలో లాభదాయంగా ఉంటుంది.

కన్య రాశి:
ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులకు అదనపు ఖర్చులు ఉంటాయి. ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

తుల రాశి:
ఈ రాశి వారు ఈరోజు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారుల పెట్టుబడులకు ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ఉల్లాసమైన వాతావరణంలో గడుపుతారు.

వృశ్చిక రాశి:
కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో నిరాశజనకంగా ఉంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా ఉంటాయి.

ధనస్సు రాశి:
ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

మకర రాశి:
కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. గతంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభరాశి:
కుటుంబ సభ్యుల విషయంలో కొంత నిరాశగా ఉంటారు. అనుకోని ఆదాయం పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త పనులు చేపడుతారు.

మీనరాశి:
విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు.ఉద్యోగులు ఒత్తిడి కారణంగా అలసిపోతారు. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలి. వ్యాపారులకు అనుకోని ఆదాయం.