Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ ‘ఎక్స్ సిరీస్’లో భాగంగా ‘హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లే, మరియు అత్యాధునిక డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్/మిడ్-రేంజ్ విభాగంలో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
ఈ ఫోన్‌లో 6.87 అంగుళాల HD ప్లస్ TFT LCD డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1,020 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో సుదీర్ఘకాలం ఫోన్ ఉపయోగించేటప్పుడు కళ్లకు అలసట కలగకుండా డైనమిక్ డిమ్మింగ్ ఐ కామ్‌ఫర్ట్ టెక్నాలజీని ఇందులో చేర్చారు. అంతేకాకుండా, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP69K రేటింగ్స్ ను ఇచ్చారు. హానర్ ఎక్స్7ఈ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. యాప్‌లు, షార్ట్‌కట్‌లు, AI ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన వన్-టాప్ AI బటన్ అందించారు.
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం.. ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తో పాటు ఒక సెకండరీ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ స్నాపర్ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ ఇందులో 8,100mAh భారీ బ్యాటరీ . రోజువారీ భారీ వినియోగానికి కూడా ఇది నిరంతర బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 6GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ కలిగిన QAR 999 (భారత కరెన్సీలో సుమారు రూ.26,000) తో విక్రయిస్తున్నారు.