Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల బైక్స్ మార్కెట్లోకి తీసుకువచ్చాయి. కానీ ఇప్పుడు అచ్చం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను పోలి కొత్త బైక్ మార్కెట్లోకి వస్తోంది. ఇందులో పవర్ ఫుల్ ఇంజన్ తో పాటు డిజైన్ కూడా ఆకట్టుకునేవిధంగా ఉండడంతోచాలా మంది దీనిని చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇంతకీ ఇది ఏ కంపెనీ బైక్? ఇది ఎలా ఉంటుంది?
Honda Motorcycle నుంచి కొత్త బైక్ CB500 మార్కెట్లోకి రాబోతుంది. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా బైక్ గా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఇంజిన్ ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో 501 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు 28.1 పవర్, 43.3 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. దీంతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా సిటీల్లో ట్రాఫిక్ నుంచి బయటపడడానికి ఇంజిన్ సహకరిస్తుంది.
ఈ బైక్ డిజైన్ చూస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇది పూర్తిగా రెట్రోల స్పోర్టీ డిజైన్ ను కలిగి ఉంది. క్లాసిక్ రౌండ్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, వెడల్పయిన హ్యాండిల్ బార్ ను చూస్తే ప్రత్యేకమైన లుక్ ను అందిస్తుంది. ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
ఇందులో ఫీచర్లు కూడా నేటి తరం వారికి అనుగుణంగా ఉండనున్నాయి. డిజిటల్ అనలాగ్ మీటర్ తో పాటు చిన్న డిజిటల్ డిస్ ప్లే ఇన్ట్రుుమెంట్ క్లస్టర్ ఉండనుంది. అలాగే హోండా రోడ్ సింగ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్ చేయనుంది. రెండు వీల్స్ కు డిస్క్ బ్రేకులు, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్, రైడింగ్ సేప్టీ కోసం హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ ను అందించారు.




