
మన దేశంలో వంటకాల్లో వాడే ముఖ్యమైన మసాలా దినుసుల్లో వెల్లుల్లి ఒకటని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని ఆరోగ్య ప్రయోజనాల కొరకు కూడా వినియోగిస్తారు. వివిధ రూపాల్లో వెల్లుల్లిని వినియోగించడం వల్ల దీనికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల వెల్లుల్లిని సాగు చేస్తే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వెల్లుల్లిలో అల్లోసిన్ అనే కెమికల్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ కెమికల్ వల్ల వెల్లుల్లి ఒక ప్రత్యేకమైన సువాసనను వెదజల్లుతుంది. ఈ కారణం వల్లే వెల్లుల్లిని ఔషధంగా కూడా వినియోగిస్తారు. గొంతు, కడుపు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో వెల్లుల్లి తోడ్పడుతుంది. ఊరగాయ, కూరగాయలు, పచ్చడి, మసాలా దినుసులలో వెల్లుల్లిని వినియోగించడం జరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, ఆర్థరైటిస్, నపుంసకత్వము, అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిని సాగు చేయాలంటే పొలాన్ని బాగా దున్ని పొలానికి సరిపడా ఎరువు వేసి వెల్లుల్లిని నాటాలి. మొక్క నుంచి మొక్కకు దూరాన్ని 10 సెంటి మీటర్లు ఉంచితే దిగుబడి బాగా వస్తుంది. వెల్లుల్లిని నాటిన తర్వాత పురుగు మందులను పిచికారీ చేస్తే చీడపీడలను నిరోధించవచ్చు.
లీటరు నీటిలో పెండమెథలిన్ 3.5 నుంచి 4 మి.లీ క్లెయిమ్ మొత్తాన్ని కలిపి పిచికారీ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో వెల్లుల్లిని సాగు చేయడం ద్వారా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్లు వెల్లుల్లిని సాగు చేస్తే భారీ లాభాలను సులువుగా పొందవచ్చు.