
ప్రముఖ టూ వీలర్ల కంపెనీలలో ఒకటైన హీరో కంపెనీ కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హీరో మోటొకార్ప్‌కు చెందిన డెస్టిని 125 స్కూటర్‌పై కంపెనీ ఏకంగా 3,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. . లాయల్టీ బోనస్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ కింద ఈ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది.
కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ తో పని చేస్తుంది. ఈ స్కూటర్ లో స్పీడ్ అలర్ట్, ట్రిప్ అనాలసిస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం గమనార్హం. ఈ స్కూటర్ లో హీరో కనెక్ట్ ఫీచర్, హాలోజెన్ హడ్‌లైట్, బల్బ్ టైయిల్‌లైట్, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
69,000 రూపాయల నుంచి ఈ స్కూటర్ ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ గరిష్ట ధర 74,500 రూపాయలుగా ఉంది. స్కూటర్ ఫ్రంట్, రియర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఉండటంతో పాటు ఈ స్కూటర్ కు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండటం గమనార్హం. ఈ స్కూటర్ బరువు 114 కేజీలు కాగా సమీపంలోని హీరో షోరూమ్ ను సంప్రదించి ఈ స్కూటర్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అమలు కానున్న నేపథ్యంలో కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వెంటనే స్కూటర్ ను కొనుగోలు చేస్తే మంచిది.