https://oktelugu.com/

Bank Account : మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు

దేశంలో ఆన్‌లైన్ చెల్లింపు, యూపీఐ సౌకర్యం ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల వినియోగం మరింత పెరిగింది.

Written By:
  • Rocky
  • , Updated On : October 26, 2024 / 11:33 PM IST

    Bank Account

    Follow us on

    Bank Account : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉండడం తప్పని సరి అయింది. ఎందుకంటే మన డబ్బుల పొదువు, ఆదాయం, లావాదేవీలను నిర్వహించడానికి ఇవి ఎంతగానో దోహదపడుతుంటాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. డిపాజిట్లు, విత్ డ్రాలు కూడా చాలా సులభం అవుతుంది. అందుకే చాలా మంది తమ రోజువారీ బ్యాంకింగ్ సంబంధిత పలు రకాల పనులను దీని ద్వారానే చేసుకుంటారు. దేశంలో ఆన్‌లైన్ చెల్లింపు, యూపీఐ సౌకర్యం ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల వినియోగం మరింత పెరిగింది. గత పది, పదిహేనేళ్లుగా బ్యాంకుల్లో ఖాతా తెరవడం సులభతరం కూడా అయిపోయింది. దీంతో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కూడా ఉంటున్నాయి. రకరకాల బ్యాంకులు ఇస్తున్న ఆఫర్ల కారణంగా కూడా బ్యాంకు ఖాతాలు పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఒక వ్యక్తికి ఉండాల్సిన బ్యాంకు ఖాతాలపై ఎలాంటి పరిమితులను విధించలేదు. అంటే ఒక వ్యక్తి 4, 5 బ్యాంకు ఖాతాలను కూడా కలిగి ఉండవచ్చు. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల నష్టం ఏముందిలే అనుకోవచ్చు. కానీ, అవసరమైన వాటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

    ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం వల్ల వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. వివిధ బ్యాంకులు రకరకాల సందర్భాల్లో విధించే నిబంధనలను తెలుసుకునే అవకాశం కోల్పోతారు. అందువల్ల మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ దెబ్బతింటుంది. ఖాతాలు ఉన్న అన్ని బ్యాంకుల నుంచి మీరు క్రెడిట్ కార్డులు తీసుకున్నట్టైతే మీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవచ్చు. మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉంటే అన్నింట్లోనూ మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. ఆ మేరకు మీ ఖతాలన్నింటిలోనూ మీ డబ్బు స్టక్ అయిపోతుంది. లేకపోతే మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి బ్యాంకు మీకు సర్వీస్‌లను అందిస్తున్నందుకు మీ నుంచి కొంత మేర ఛార్జీ వసూలు చేస్తుంది. మీకు మెసేజ్‌లు పంపిస్తున్నందుకు, ఏటీఎమ్ ఏటీఎం సేవలు అందిస్తున్నందుకు, వార్షిక సర్వీస్ ఛార్జ్.. ఇలా మీరు ఎంతో కొంత బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. పొదుపు ఖాతా కాకుండా ఇంకా చాలా రకాల ఖాతాలు ఉంటాయి. కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, జాయింట్ అకౌంట్.. ఇలా మీ అవసరకాలకు సరిఅయిన దానిని ఉంచుకుని మిగలినవి క్లోజ్ చేసుకుంటే మంచిది.

    మీకు మూడు ఖాతాలుంటే వాటిలో రెండు వాడి ఒకటి వాడకుండా రెండేళ్ల పాటు అలాగే ఉండిపోతే ఇన్ ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాగా పరిగణిస్తారు. బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయమంటే బ్యాంక్ వాళ్లు మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయనందుకు ఫైన్ వేస్తారు. అలాంటి సందర్భంలో ఫస్ట్ బ్యాంక్ ఖాతాను ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాగా మార్చుకుని క్లోజ్ చేయమని చెప్పొచ్చు. రెండేళ్ల పాటు ఒక్క ట్రాన్సాక్షన్ చేయలేదు అంటే డబ్బులు వేయడం లేదా తీయడం చేయలేదు కాబట్టి బ్యాంకులు ఫైన్ వేయడానికి వీళ్లేదు. అందుకనే ఆపరేటివ్ ఖాతాగా మార్చి బ్యాంక్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది.