https://oktelugu.com/

Income Tax Notice : ఆదాయపు పన్ను నుంచి నోటీసులు వచ్చాయా? అవి నకిలీవి కూడా కొవచ్చు.. మరెలా చెక్ చేసుకోవాలి?

కాలం పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. వినియోగదారుల డేటాను సేకరించిన కొందరు వారిని వివిధ రకాలుగా మోసాలు చేస్తున్నారు. తాజాగా ఫేక్ ఐటీ నోటీసుల ద్వారా డబ్బు కొల్లగొడుతున్నారు. సాధారణంగానే కొందరు ఐటీ చెల్లించప్పుడు వారు ఏదో తప్పు చేశామనే భయం ఉంటుంది

Written By:
  • Srinivas
  • , Updated On : August 19, 2024 1:19 pm
    Income tax fake Notice

    Income tax fake Notice

    Follow us on

    Income Tax Notice  : ఆదాయం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది కోట్ల రూపాయాల ఆదాయపు పన్నును వినియోగదారులు చెల్లిస్తున్నారు.అయితే కొందరు ఆదాయపు పన్నును సంవత్సరాల కొద్దీ కట్టడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి ఐటీ అధికారులు రైడ్ చేస్తుంటారు. ప్రభుత్వానికి చెల్లించకుండ అక్రమ ధనాన్ని కలగి ఉంటే స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. దీంతో కొందరు ముందగానే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటూ ఉంటారు. ప్రతీ సంవత్సరం జూలై లో ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు ఆదాయపు పన్నును కట్టకుండా ఉండడం వల్ల వారికి ఐటీ డిపార్ట్ మెంట్ నోటీసులు అందిస్తూ ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ నోటీసులు కూడా పంపిస్తున్నారు. ఇలా నకిలీ నోటీసులు వస్తే ఏం చేయాలో తెలుసా?

    కాలం పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. వినియోగదారుల డేటాను సేకరించిన కొందరు వారిని వివిధ రకాలుగా మోసాలు చేస్తున్నారు. తాజాగా ఫేక్ ఐటీ నోటీసుల ద్వారా డబ్బు కొల్లగొడుతున్నారు. సాధారణంగానే కొందరు ఐటీ చెల్లించప్పుడు వారు ఏదో తప్పు చేశామనే భయం ఉంటుంది. దీంతో కొందరు నకిలీ నోటీసులుపంపిస్తారు. ఈ నోటీసులు అందుకున్న వారు తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతో కొందరు మోసగాళ్లు కొన్నినెంబర్లు, లేదా వెబ్ సైట్లుఇచ్చివాటి ద్వారా మనీ పే చేయాలని చెబుతున్నారు. ఇలా వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ లేదా వెబ్ సైట్ ద్వారాడబ్బులు చెల్లిస్తే అవి ప్రభుత్వానికి వెళ్లవు. మోసగాళ్ల జేబుల్లోకి వెళ్తాయి. అయితే ఇలాంటప్పుడు ఇవి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన నోటిసులా? లేక నకిలీవా? అని ఈ చిన్న ట్రిక్ ద్వార తెలుసుకోవచ్చు. అదెలాగంటే?

    ముందుగా Google లోకివెళ్లి Incometax.gov.in అని టైప్ చేయాలి. ఇప్పుడు మొదటగా ఉన్న వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత ఇన్ కం టాక్స్ వెబ్ సైట్ లో కి వెళ్లిన తరువాత కింద బాక్స్ లో Authentic Notification అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన తరువాత కొన్ని ఆప్షన్లు అడుగుతుంది. ఇందులో రెండో ఆప్షన్ పై టిక్ చేయాలి. ఆ తరువాత అందుకున్న నోటీసుపై ఉన్న డాక్యుమెంట్ నెంబర్ ను టైప్ చేయాలి. ఆ తరువాత మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఇప్పుడు అందుకున్న నోటీసులు ఐటీ డిపార్టుమెంట్ వారు పంపించినట్లయిదే అందులో చూపిస్తుంది. ఇవి నకిలీవి అయితే No Records అని మెసేజ్ వస్తుంది.ఇలా చెక్ చేసుకున్న తరువాతనే ఆ నోటీసులపై స్పందించాలి.

    ఇక నోటీసులు తీసుకువచ్చిన వ్యక్తితో పాటు అందించిన వారి డీటేయిల్స్ ఉంటే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే వారుమరొకరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఐటీ ఫైల్స్ రెగ్యులర్ గా కట్టిన సమయంలో ఇలా వెబ్ సైట్ ద్వారా తమ ఆదాయపు పన్నుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆదాయపు పన్ను ఎవరిద్వారా చెల్లిస్తున్నారో.. వారు సరిగ్గా ఫైల్ చేస్తున్నారా? లేదా చూసుకోవాలి.