Google Pay : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బ్యాంకు లావాదేవీలు కూడా అత్యంత సులభం అయ్యాయి. ఒకప్పుడు లావాదేవీలు నిర్వహించాలంటే కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉండేది. అక్కడ చాంతడంత క్యూలో నిలబడి.. మన వంతు వచ్చేసరికి చాలా సమయం పట్టేది. దీంతో బ్యాంకులకు వెళ్లాలంటేనే చాలామంది జంకే వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కడంతో.. డిజిటల్ లావాదేవీలు తెరపైకి వచ్చాయి. కోవిడ్ తర్వాత ఇలా డిజిటల్ రూపంలో లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో సుమారు 30 కోట్ల మంది యాక్టివ్ డిజిటల్ పేమెంట్స్ యూజర్లు ఉన్నారని తెలుస్తోంది. వీరు ఏదో ఒక పేమెంట్ యాప్ ద్వారా తమ లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని.. భవిష్యత్తు కాలంలో బ్యాంకులు అనేవి కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతాయని వినికిడి.
డిజిటల్ పేమెంట్ విభాగంలో..
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విభాగంలో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటివి సేవలందిస్తున్నాయి.. ఇక ఆయా బ్యాంకులు కూడా వ్యాలెట్ సేవలు అందిస్తున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే మిగతా వారి పరిస్థితి ఏమో గాని.. వ్యాపారులకు మాత్రం ఈ డిజిటల్ పేమెంట్స్ ఒక తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ప్రతిరోజు లావాదేవీలు జరుగుతుండడం.. దానివల్ల హిస్టరీ పెరిగిపోతుంది. ఒక్కోసారి దీనివల్ల వారు ఇబ్బంది పడుతుంటారు. అయితే అటువంటి వారి కోసమే ఈ కథనం. అయితే చాలామందికి గూగుల్ పే లో హిస్టరీ డిలీట్ చేయడం రాదు. దీనివల్ల పేమెంట్ హిస్టరీ పెరిగిపోయి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక్కోసారి చెల్లింపుల్లో అవరోధం కూడా చోటు చేసుకుంటుంది. అలాంటప్పుడు గూగుల్ పే లో హిస్టరీ డిలీట్ ఎలా చేయాలంటే..
ముందుగా గూగుల్ పే ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ పై టాప్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ప్రైవసీ, సెక్యూరిటీపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత డేటా , పర్సనలైజేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం గూగుల్, ఖాతా లింక్ పైన నొక్కాలి.
ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ పే ఎక్స్పీరియన్స్ పేజ్ ని కిందికి స్క్రోల్ చేయాలి. అక్కడ గూగుల్ పే లావాదేవీల హిస్టరీలోకి వెళ్లాలి. ఆ తర్వాత మీరు వద్దనుకున్న లావాదేవీల హిస్టరీని డిలీట్ చేస్తే సరిపోతుంది..
ఆ తర్వాత ఆ హిస్టరీ మీకు కనిపించదు. దీనివల్ల హిస్టరీ క్లియర్ కావడంతో పాటు.. లావాదేవీలు కూడా సులభంగా జరిపేందుకు అవకాశం ఉంటుంది.. అయితే చాలామంది గూగుల్ పే లో కొన్ని లావాదేవీలను హైడ్ లో ఉంచుతారు. అయితే అటువంటి వారికి ఈ చిన్న టెక్నిక్స్ ఎంతో ఉపయోగంగా ఉంటాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Have the transactions in google pay increased with these small tips you can delete the entire history
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com