https://oktelugu.com/

Insurance: పోస్టాఫీస్ సూపర్ ఇన్సూరెన్స్ ప్లాన్.. తక్కువ పెట్టుబడితో..?

తక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకోవాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్ లలో గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఆకర్షణీయ రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ గా ఉంటుంది. ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులకు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఇండియా […]

Written By: , Updated On : August 18, 2021 / 06:18 PM IST
Follow us on

తక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకోవాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. పోస్టాఫీస్ అమలు చేస్తున్న స్కీమ్ లలో గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఆకర్షణీయ రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ గా ఉంటుంది. ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులకు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

ఇండియా పోస్ట్ ఆఫీస్ గ్రామాల్లో నివశించే ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టల్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల బలహీన వర్గాల కుటుంబాలకు ఈ పోస్టల్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు బీమా మొత్తాన్ని అందిస్తోంది. ఈ పథకం ఎండోమెంట్ బీమా పథకం కాగా 19 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ను తీసుకోవచ్చు.

కనీసం 10,000 రూపాయలు కాగా గరిష్టంగా 10,00,000 రూపాయలకు ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద మెచ్యూరిటీ వరకు డిపాజిట్ బోనస్, భీమా మొత్తాన్ని చెల్లిస్తారని హామీగా ఉంది. బీమాదారు మరణించినట్లయితే బీమా మొత్తంతో పాటు బోనస్ ను నామినీ పొందవచ్చు. కస్టమర్ ఐదేళ్లు పూర్తి కాకముందే పాలసీపై రుణం తీసుకుంటే బోనస్ పొందలేరు.

ఈ బీమా పాలసీ తీసుకున్న వాళ్లకు నామినీని మార్చుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ బీమా పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.