Paytm Crisis: దేశంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా గూగుల్ భారీ షాక్ ఇచ్చింది. త్వరలోనే త్వరలో భారత్‌లో మిలియన్ల మంది చిరు వ్యాపారులకు ఆడియో అలర్ట్‌తో కూడిన క్యూఆర్ కోడ్‌తో లావాదేవీలు జరిపే స్పీకర్ సౌండ్‌ప్యాడ్స్ విడుదల చేస్తామని ప్రకటించింది.
పీటీఎం సంక్షభాన్ని క్యాష్ చేసుకునేలా..
పేటీఎం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా, క్యాష్ చేసుకునేలా ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది పేటీఎం యూజర్లు యూసీఐ పేమెంట్స్ కోసం చిరు వ్యాపారులు సౌండ్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. దీనిపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. మార్చి చివరి నాటికి లావాదేవీలు క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన గూగుల్.. గతేడాది తన సౌండ్ బాక్సుల పనితీరు ఎలా ఉంది. లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి. అనే అభిప్రాయాలు సేకరించింది. గూగుల్ సౌండ్ బాక్స్‌లకు మంచి స్పందన రావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిలియన్ల సౌండ్ బాక్కులు వ్యాపారులకు అందించాలని నిర్ణయించింది.
ఆరు భాషల్లో..
గూగుల్ సౌండ్ బాక్సులను ఇంగ్లిష్‌తోపాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషల్లో ఆడియో అలర్ట్‌ను అందించే గూగుల్ సౌండ్ ప్యాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారీ లేదా ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ ఇలా..
రోజువారీ ప్లాన్‌లో, వ్యాపారులు వన్‌టైమ్ సబ్‌స్క్రిప్షన్ కింద రూ.499 చెల్లించాలి. తర్వాత వారి సెటిల్‌మెంట్ ఖాతా నుంచి నెలలో 25 రోజులపాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్‌లో వ్యాపారి సెటిల్‌మెంట్ అకౌంట్ నుంచి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ ప్రకటించింది. క్యూర్ కోడ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంతో ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్‌పే క్యూర్ కోడ్ ద్వారా నెలకు రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ.125 క్యాష్‌బ్యాక్ పొందవచ్చని గూగుల్ తెలిపింది.