Homeబిజినెస్New Google Pixel series: గుడ్ న్యూస్ చెప్పనున్న గూగుల్.. త్వరలో మూడు కొత్త ఫోన్లు.....

New Google Pixel series: గుడ్ న్యూస్ చెప్పనున్న గూగుల్.. త్వరలో మూడు కొత్త ఫోన్లు.. ఎలా ఉంటాయంటే…

New Google Pixel series: మార్కెట్లో కొత్త ఫోన్లు సందడి చేయనున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకర్షించేందుకు వివిధ వేరియంట్ల మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో Google Pixel 11, Pixel 11 Pro, Pro XL తో పాటు Pixel Fold ఉన్నాయి. ఈ ఫోన్ల విడుదలపై అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. కొన్ని లీక్స్ ప్రకారం ఇవి ఆగస్టు 2026లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు Tensor G6 చిప్‌తో రానున్నాయి. ఇది CPUలో మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ GPUలో కొంత వెనుకబాటుగా ఉండవచ్చు. అయితే లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..

Pixel 11:
Google Pixel 11 సాధారణ మోడల్‌గా 6.3-ఇంచ్ OLED డిస్‌ప్లే (120Hz, 2200 nits)తో ఉండనుంది. ఇందులో 8 నుంచి 12GB RAM సపోర్టు చేయనుంది. 50MP మెయిన్ కెమెరా, 4840mAh బ్యాటరీతో పనిచయనుంది. Tensor G6 చిప్ CPU సింగిల్-కోర్ తో గతంలో ఉన్న ఫోన్ కంటే వేగవంతంగా పనిచేస్తుంది. అయితే గ్రాఫిక్స్ గేమింగ్‌లో స్నాప్‌డ్రాగన్‌లతో పోటీ పడకపోవచ్చు. భారత్‌లో ఈ ఫోన్ రూ. 79,990 నుంచి రూ.84,999 ఉండొచ్చంటున్నారు.

Pixel 11 Pro & Pro XL:
Pixel 11 Pro 6.3(1280×2856, 2450 nits) అంగుళాలతో పనిచేయనుంది. Pro XL 6.8-ఇంచ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 12/16GB RAM, 50MP+48/50MP ట్రిపుల్ కెమెరాలు ఉండనున్నాయి. 4707 లేదా 5000mAh బ్యాటరీ ఉండే అవకాశం. Tensor G6తో మల్టీ-టాస్కింగ్, కెమెరా AI ఫీచర్లు ఉంటాయి. CPU మెరుగులతో ఎఫిషియెన్సీ బెటర్ కానీ GPU పాత డిజైన్ వల్ల హై-ఎండ్ గేమింగ్‌లో వెనుకబడవచ్చు. ఇది భారత్ లో రిలీజ్ అయితే రూ.1,03,999 నుంచి రూ.1,19,999-₹1,36,999 వరకు ఉండొచ్చు.

Pixel Fold (Pro Fold):
ఫోల్డింగ్ ఫోన్ కోసం ఎదురుచూసేవారికి Pixel 11 Pro Fold ఫోల్డబుల్‌ ఆకర్షించనుంది. 2076×2160 ఇన్నర్ ఫోల్డింగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 120Hz, 2050 nits బ్రైట్నెస్ ను అందిస్తుంది. కవర్ డిస్‌ప్లే 1080×2342 గా ఉండనుంది. ఈ మొబైల్ 12 నుంచి 16GB RAM సపోర్ట్, 48MP+10.5MP+10.8MP కెమెరాలు ఉండనున్నాయి. 4658mAh బ్యాటరీ ఉండి.. 30W వైర్డ్ చార్జింగ్‌తో పనిచేస్తుంది. Tensor G6తో ఫోల్డబుల్ ఎఫిషియెన్సీ మెరుగ్గా, మల్టీటాస్కింగ్ సూపర్, కానీ బ్యాటరీ ఆంక్షైటీ తగ్గించవచ్చు. దీని ధర రూ.1,50,000 ఉండే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version