Homeబిజినెస్Google Pixel 10 A: ఈ ఫోన్ పై ఏకంగా రూ.13,000 తగ్గింపు.. ఆఫర్ పరిమిత...

Google Pixel 10 A: ఈ ఫోన్ పై ఏకంగా రూ.13,000 తగ్గింపు.. ఆఫర్ పరిమిత కాలం మాత్రమే..

Google Pixel 10 A: Google కంపెనీకి చెందిన pixel 10 ఎ ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చింది. ప్రీమియం మొబైల్స్ కొనేవారికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. రిలీజ్ అయిన నుంచి ఇప్పటివరకు ఈ ఫోన్ కు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ మొబైల్ కొనాలని చాలామందికి ఆసక్తి ఉన్నా ధర కాస్త ఎక్కువగా ఉండడంతో చాలామంది వెనుకడుగు వేశారు. అయితే ఇలాంటి వారి కోసం కంపెనీ ఈ మొబైల్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ టెన్ ఎ మొబైల్ కొంటే దాదాపు రూ.13,003 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చని తెలుపుతోంది. ఇంతకీ ఈ ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయి అంటే?

Google pixel 10 a మొబైల్ లో అద్భుతమైన డిస్ప్లే ను చూడవచ్చు. ఇందులో 6.29 అంగుళాల POLED డిస్ప్లే ఉండనుంది. దీనిపై గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఇది 2000 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 తో పనిచేసే ఇందులో 8 జిబి రామ్ ఉండనుంది. అలాగే 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ టెన్సర్ G4 , టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్ ఉండనుంది. ఈ మొబైల్ లో 48 మెగా పిక్సెల్ తో కూడిన బ్యాక్ కెమెరా ఉంటుంది. అలాగే 13 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 13 మెగా పిక్సెల్ కంటి కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ కెమెరా లో ఎడిటింగ్ ఫీచర్స్ తో పాటు ఏఐ ఫ్యూచర్ లు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటితోపాటు వీడియో కెమెరా కూడా 4k Resolution తో రికార్డు చేసుకోవచ్చు.

ఈ మొబైల్ లో బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 45 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ చార్జింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు రూ.49,999 ప్రారంభతరతో ఉండేది. అయితే ఇప్పుడు దీనిపై రూ.13,003 తగ్గింపు ధరను పొందవచ్చు. ఇందులో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా రూ.7,003 సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్చేంజి బోనస్ ద్వారా రూ.3,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇనిస్టాండ్ క్యాష్ బ్యాక్ రూ.3,000 గా ఉంది. ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించేందుకు గూగుల్ ప్రత్యేక ఆఫర్ను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అని తెలుపుతోంది. వీటిని పొందాలంటే గూగుల్ స్టోర్ లేదా ఫ్లిప్కార్ట్ ద్వారా మొబైల్స్ సేల్స్ చేయాల్సి ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version