Google CEO Sundar Pichai: గూగుల్ సీఈవోకు ఎన్ని కార్లున్నాయో తెలుసా? లగ్జరీ లైఫ్ చూస్తే పిచ్చెక్కుతుంది

పిచాయ్ స్థిరాస్తుల్లో మర్సిడెస్ ఎస్ 650 అత్యంత ఖరీదైన వాహనం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా కాన్వాయ్ లో ఈ కారును వాడతారు. దీని ధర రూ. 3.21 కోట్లు ఉంటుంది.

Written By: Srinivas, Updated On : June 30, 2023 4:25 pm

Google CEO Sundar Pichai

Follow us on

Google CEO Sundar Pichai: గూగుల్ మాతృసంస్త అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్. ఆయన ఏడాది జీతం రూ.1850 కోట్లు. ఇంత భారీ జీతం తీసుకుంటున్న అతడి జీవితం లగ్జరీయే. ప్రస్తుత పరిస్థితుల్లో రూ. లక్షల్లో వేతనం తీసుకుంటున్న వారే ఖరీదైన బంగ్లా, మంచి కారు ఉన్నతంగా బతుకుతుంటే అతడు కోట్లలో సంపాదిస్తున్నాడు. అందుకే ఆయన జీవితం పూలపాన్పే. ఎటు చూసినా నౌకర్లు. సౌకర్యవంతమైన ఇల్లు. ఆనందంగా సాగుతున్న అతడి జీవితం గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.

సాధారణ జీవితం

సుందర్ పిచాయ్ పుట్టుకతోనే ధనవంతుడు కాడు. సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి అసాధారణ స్థితికి ఎదిగాడు. మొదట పిచాయ్ ని తన తండ్రి అమెరికా పంపడానికి నానా కష్టాలు పడ్డాడు. చివరకు పంపాడు. అక్కడ సాధారణ ఉద్యోగిగా ప్రవేశించిన పిచాయ్ తన తెలివితేటలతో 2015లోనే సీఈవో స్థాయికి ఎదిగాడు. అత్యధిక వేతనం అందుకుంటున్న టెక్ దిగ్గజంగా మారాడు.

కలల సౌధం

చెన్నైలో ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్న పిచాయ్ రూ. 4 కోట్ల డాలర్ల విలువన కలల సౌధాన్నినిర్మించుకున్నాడు. కాలిఫోర్నియాలో రాష్ట్రం శాంటాక్లారా కౌంటీలోని లాస్ అల్లోస్ లో 31 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటి మార్పుల కోసం రూ. 49 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక ఇల్లు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇంటి సమీపంలోనే కొలను, ఇన్ ఫినిటీ ఫూల్, కరెంటు కష్టాలు రాకుండా మేడపై సౌర పలకాలు ఏర్పాటు చేశారు.

ఖరీదైన కారు

పిచాయ్ స్థిరాస్తుల్లో మర్సిడెస్ ఎస్ 650 అత్యంత ఖరీదైన వాహనం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా కాన్వాయ్ లో ఈ కారును వాడతారు. దీని ధర రూ. 3.21 కోట్లు ఉంటుంది. 190 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వాతావరణానికి తగినట్లు గా మార్చుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారును పిచాయ్ వాడుతుంటారు. ఇంకా పిచాయ్ దగ్గర అనేక కార్లున్నాయి. వాటి గురించి తెలిస్తే మనకు షాకే.

వాచ్ లు కూడా..

పిచాయ్ ఖరీదైన మొబైల ఫోన్లు అంటే ఆసక్తి ఉంటుంది. పిక్సెల్ పోల్డ్, పిక్సెల్ 7 ప్రొ, శామ్ సంగ్ గెలాక్సీ ఐ ఫోన్లు వంటివి వాడుతుంటారు. ఫోన్లను టెస్టింగ్ కోసం ఎక్కువగా వాడతారట. గతంలో పిచాయ్ వాచ్ ధరించే వారు కాదు. కానీ ఇప్పుడు ఫాజిల్ స్మోర్ట్స్, గూగుల్ పిక్సెల్ వాచ్ లు ధరిస్తున్నారు. ప్రపంచంలోనే ధనవంతుడు కావడంతో అతడి జీవన విధానం కూడా అలాగే ఉంటుంది.