Whatsapp Cashback: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్!

Whatsapp Cashback:ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్ ను వినియోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ యాప్ ను వాడతారు. దేశంలో వాట్సాప్ యాప్ ను వాడే యూజర్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వాట్సాప్ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే వాట్సాప్ యాప్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 4, 2021 8:42 pm
Follow us on

Whatsapp Cashback:ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్ ను వినియోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్ యాప్ ను వాడతారు. దేశంలో వాట్సాప్ యాప్ ను వాడే యూజర్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వాట్సాప్ యాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

అయితే వాట్సాప్ యాప్ ను వాడేవాళ్లకు అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ ద్వారా నగదు బదిలీ చేస్తే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో వాట్సాప్ యాప్ క్యాష్ బ్యాక్ ను అందిస్తుండటం గమనార్హం. వాట్సాప్ నుంచి నగదు బదిలీ చేయడం ద్వారా ఈ క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఐదు లావాదేవీల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల కోసం ఎక్కువమంది గూగుల్ పే, ఫోన్ పే యాప్ లను వినియోగిస్తున్నారు. డబ్బులు పంపిన వెంటనే ఖాతాలో క్యాష్ బ్యాక్ జమ కానుంది. తక్కువ మొత్తం పంపినా క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ ఉండటంతో ఎక్కువమంది ఈ విధంగా క్యాష్ బ్యాక్ పొందడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. క్యాష్ బ్యాక్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చని భావించి వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ చాట్ చేయవచ్చు.. ఎలా అంటే?

వాట్సాప్ తెచ్చిన ఈ ఆఫర్ వల్ల వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ యూజర్ల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు దేశంలో రోజురోజుకు వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.