Bank Loans: ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు చాలా మంది బ్యాంకు లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. కానీ 2025 ఏడాది నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గిస్తూ వస్తోంది. అయితే తాజాగా రెపో రేటును 5.50 శాతంగా కొనసాగించింది. దీంతో ఇప్పటికే హోం లోన్లు తీసుకున్న వారి ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని బ్యాంకులు MCLRను తగ్గించాలని నిర్ణయించాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)రెపో రేటును 5.50 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ ప్రతి రెండు నెలలకోసారి రెపో రేటుపై సమీక్ష చేస్తూ ఉంటుంది. ఆర్బీఐకి చెందిన ద్రవ్య విధాన కమిటీ ఏడాదిలో ఆరు సార్లు సమావేశమై రెపో రేటుతో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒక్కోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెపో రేటును మార్చే అవకాశం ఉంది. 2025 ప్రారంభం నంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 3 సార్లు రెపో రేటును తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న 0.25 తగ్గించారు. ఏప్రిల్ 9న 0.25 తగ్గించారు. జూన్ 6న 0.50 శాతం తగ్గించారు. జూన్ 7న రెపో రేటును తగ్గించిన సమయంలో 5.50 గా కొనసాగింది. ప్రస్తుతం దీనిని స్థిరంగానే కొనసాగించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకులు Marginal Cost Of Funds Based Lendng Rate (MCLR)పై నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం రెపో రేటు స్థిరంగా కొనసాగుతుండడంతో కొన్ని బ్యాంకులు MCLR ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. రెపో రేటు తగ్గినా.. స్థిరంగా ఉన్నా.. బ్యాంకులపై వడ్డీ భారం తగ్గుతుంది. దీంతో కొన్ని బ్యాంకులు తమ ఖర్చులను తగ్గించుకొని ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడుతాయి. మార్కెట్లో ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు తమ వద్ద ఉన్న అదనపు నిధులతో రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.
అంతేకాకుండా ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లను తగ్గించి.. ఈఎంఐ ని తగ్గిస్తాయి. అలా బ్యాంక్ ఆప్ ఇండియా బ్యాంకు 7.75, ఐడీబీఐ 8.9 శాతం, ఇండియన్ బ్యాంక్ 7.95 శాతం, హెచ్ డీఎప్ సీ 8.4 శాతం ఈఎంఐలు తగ్గనున్నాయి. ముఖ్యగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. బ్యాంకుల నుంచి పోటీ తట్టుకోవడానికి MCLR ను తగ్గించి వినియోగదారులను ఆకర్షిస్తాయి.