
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కేంద్రం మరింత పొడిగించింది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల జూన్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుండగా పన్ను చెల్లింపుదారులకు కేంద్రం నిర్ణయం ద్వారా ఊరట కలగనుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ గడువు ఉండగా దాదాపు రెండు నెలలు గడువును పొడిగించడం గమనార్హం. ట్యాక్స్ పేయర్స్ పన్ను అంశానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సులభంగా ఈ విధానం ద్వారా పరిష్కరించుకోవచ్చు.
ఒకేసారి కొంత పేమెంట్ చెల్లిస్తే పాత బకాయిలు అన్నీ సెటిల్ మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతేడాదిలా కేంద్రం రుణాలపై మారటోరియం విధించే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.
మరోవైపు కేసులు పెరుగుతున్నా కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయడానికి సుముఖంగా లేదు. పరిస్థితి అదుపు తప్పితే మాత్రమే కేంద్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.