ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బంగారం ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. బంగారు డిపాజిట్ పథకంలో కీలక మార్పులు చేసి బంగారం తక్కువగా ఉన్నవారికి కూడా ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ బ్యాంస్ అసోసియేషన్ కనీసం 30 గ్రాముల బంగారం ఉంటే మాత్రమే బంగారు డిపాజిట్ పథకం కింద డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పించేది. ఇకపై 30 గ్రాముల కంటే తక్కువ బంగారం ఉన్నా బంగారు డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్ చేయవచ్చు.
Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.1000తో లక్షలు పొందే ఛాన్స్..?
బంగారు డిపాజిట్ స్కీమ్ లో బంగారాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఇంట్లో వృథాగా ఉండే బంగారంపై వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండగా బ్యాంకు అందించిన పత్రాన్ని వేరే వ్యక్తికి బదిలీ చేయడం లేదా విక్రయించే అవకాశాన్ని కూడా బ్యాంకులు కల్పిస్తూ ఉండటం గమనార్హం. బంగారాన్ని డిపాజిట్ చేసిన వాళ్లకు బ్యాంక్ నిర్ణయించిన రేట్ల ప్రకారం వడ్డీ లభిస్తుంది.
Also Read: ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ లో బ్యాంకు సెలవులు ఇవే..?
ఎక్కువ సంవత్సరాలకు డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ సర్టిఫికెట్ల ద్వారా రుణం పొందే అవకాశాన్ని కూడా బ్యాంకులు కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఇంట్లో అదనంగా బంగారం ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదనే సంగతి తెలిసిందే. భారత బ్యాంకుల సంఘం త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ అమలు కొరకు మొబైల్ యాప్ తో పాటు ప్రత్యేక పోర్టల్ ను సిద్ధం చేసింది.
ఎస్బీఐ ఈ ఫ్లాట్ ఫామ్ నిర్వహణ, ఇతర బాధ్యతలను చూసుకుంటోందని తెలుస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 20 టన్నుల పసిడి మాత్రమే బ్యాంకులలో డిపాజిట్ కాగా బ్యాంకు లాకర్లలో, ఇళ్లలో ఏకంగా 24,000 టన్నుల బంగారం నిరుపయోగంగా ఉందని తెలుస్తోంది.