Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలను బట్టి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీలోని గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే లీటర్ పెట్రోల్ ధర 110.67 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 96.08 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ధర 11.32 శాతం క్షీణించడం గమనార్హం. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర కూడా క్షీణించడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందని వస్తున్న వార్తల పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతవరకు తగ్గుతాయో చూడాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గించడానికి కృషి చేస్తోంది.