https://oktelugu.com/

Jio Recharge:  జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. సులువుగా రీఛార్జ్ చేసుకునే ఛాన్స్!

Jio Recharge:  దేశీయ టెలీకాం రంగంలో జియో ఎన్నో సంచలనాలు సృష్టించడంతో పాటు ఇతర టెలీకాం కంపెనీలతో పోల్చి చూస్తే అద్భుతమైన ఆఫర్లను ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. దేశంలోనే ఎక్కువమంది యూజర్లు ఉన్న టెలీకాం కంపెనీగా జియో నిలిచింది. యువత ప్రస్తుతం ఎక్కువగా జియోను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జియో యూజర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. సాధారణంగా రీఛార్జ్ ప్లాన్ ముగిసిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. టెలీకాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ కు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2022 / 08:46 AM IST
    Follow us on

    Jio Recharge:  దేశీయ టెలీకాం రంగంలో జియో ఎన్నో సంచలనాలు సృష్టించడంతో పాటు ఇతర టెలీకాం కంపెనీలతో పోల్చి చూస్తే అద్భుతమైన ఆఫర్లను ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. దేశంలోనే ఎక్కువమంది యూజర్లు ఉన్న టెలీకాం కంపెనీగా జియో నిలిచింది. యువత ప్రస్తుతం ఎక్కువగా జియోను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జియో యూజర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది.

    సాధారణంగా రీఛార్జ్ ప్లాన్ ముగిసిపోయిన తర్వాత కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. టెలీకాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ కు సంబంధించి మొబైల్ కు మెసేజ్ లను పంపించడం ద్వారా కస్టమర్లను అలర్ట్ చేస్తాయి. అయితే కొంతమంది బిజీగా ఉండటం వలన, ఇతర కారణాల వలన వెంటనే రీఛార్జ్ చేసుకోవడం సాధ్యం కాదు. అయితే ఆటో డెబిట్ ఫీచర్ సహాయంతో జియో యూజర్లు రీఛార్జ్ చేసుకునే ఛాన్స్ ను ఈ సంస్థ కల్పిస్తోంది.

    ప్రీపెయిడ్ కస్టమర్లతో పాటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. జియో ఎన్.పీ.సీ.ఐతో కలిసి అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ ద్వారా జియో యూజర్లకు ఎంతో మేలు జరగనుంది. జియో యూజర్లు ఎవరైతే ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలని అనుకుంటారో మై జియో యాప్ సహాయంతో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

    ఈ యాప్ లో జియో ఆటో పే అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల వ్యాలిడిటీ అయిపోయిన ప్రతిసారి ఆటోమేటిక్ గా రీఛార్జ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా నచ్చిన ప్లాన్ ను సులభంగా రీఛార్జ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.