https://oktelugu.com/

Agriculture Loan: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రుణ లక్ష్యం భారీగా పెంచుతూ?

Agriculture Loan:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ పదో విడత నగదు రైతుల ఖాతాలలో జమైన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం చేస్తున్న సాయం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని రైతులు చెబుతున్నారు. అయితే కేంద్రం రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో వ్యవసాయ రుణాలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2022 / 09:44 AM IST
    Follow us on

    Agriculture Loan:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ పదో విడత నగదు రైతుల ఖాతాలలో జమైన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం చేస్తున్న సాయం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని రైతులు చెబుతున్నారు. అయితే కేంద్రం రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో వ్యవసాయ రుణాలను పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

    ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో రైతులకు అనుకూలంగా ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. వ్యవసాయ రంగానికి అధిక రుణం కేటాయించాలని కేంద్రం అనుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 18 లక్షల కోట్ల రూపాయల నుంచి 18.5 లక్షల కోట్ల రూపాయలకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని బోగట్టా. సాధారణంగా వ్యవసాయ రుణాలపై వడ్డీరేటు 9 శాతంగా ఉంటుంది.

    అయితే కేంద్రం మాత్రం వడ్డీ రాయితీ బెనిఫిట్ ను కల్పించడానికి సిద్ధమవుతోంది. 3 లక్షల రూపాయల లోపు తీసుకున్న రుణంపై 2 శాతం వడ్డీ తగ్గింపు బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తీసుకున్న రుణాన్ని సరైన సమయానికి చెల్లిస్తే వడ్డీరేటు మరో 3 శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎలాంటి తనఖా లేకుండా రైతులు 1,60,000 రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు.

    కేంద్రం ఖాతాలలో జమ చేసిన డబ్బులు మీ ఖాతాలో కూడా జమయ్యాయో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.